Home

»

Latest News

క్లాష్ లేకుండా బాక్సాఫీస్ బరిలోకి 'నాగబంధం'.. హాట్ టాపిక్‌గా మారిన యంగ్ హీరో మూవీ!

Jun 5, 2026 6:01PM

టాలీవుడ్‌లో సరికొత్త మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ‘నాగబంధం’ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. భారీ బడ్జెట్‌తో, విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. సమ్మర్ సీజన్ ముగిసిన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఉండే ఖాళీ సమయాన్ని క్యాష్ చేసుకోవాలనే పక్కా వ్యూహంతో మేకర్స్ ఈ డేట్‌ను లాక్ చేశారు.

ఈ సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా సోలోగా థియేటర్లలోకి దించాలనేది నిర్మాతల అసలు ప్లాన్. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల క్లాష్ లేకపోతే ఓపెనింగ్స్ అద్భుతంగా వస్తాయని, కంటెంట్‌పై ఉన్న గట్టి నమ్మకంతోనే అభిషేక్ నామా టీమ్ ఈ డేట్‌ను ఎంచుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడమే ఈ టీమ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌లో అందరినీ ఆకర్షిస్తున్న ముఖ్యమైన అంశం యంగ్ హీరో విరాట్ కర్ణ. కెరీర్ ఆరంభంలోనే, అది కూడా కేవలం తన రెండో సినిమాతోనే ఏకంగా పాన్ ఇండియా సబ్జెక్టును టేకప్ చేయడం విశేషం. సాధారణంగా 1750ల నాటి కథ, పురాతన నిధులు, దైవిక శక్తుల నేపథ్యం అంటే స్టార్ హీరోలను ఊహించుకుంటారు. కానీ కథా బలాన్ని నమ్మి ఒక కొత్త కుర్రాడితో ఇంతటి ప్రతిష్టాత్మకమైన సినిమాను నిర్మించడం ట్రేడ్ వర్గాల్లో సైతం ఆసక్తి రేపుతోంది.

గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో వస్తున్న మైథలాజికల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకుంటున్నాయి. స్టార్ ఇమేజ్ కంటే కూడా బలమైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపితమైంది. ‘నాగబంధం’ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. పరాయి దేశాల దండయాత్రల నుండి మన దేశ సంపదను, పురాతన గుడులలో దాగి ఉన్న రహస్యాలను కాపాడే శివుని అంశతో సాగే ఈ కథ ప్రేక్షకులకు ఒక సరికొత్త థ్రిల్‌ను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. సీనియర్ నటుడు జగపతి బాబు ఒక కీలక పాత్రలో కనిపిస్తుండగా.. గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం నభా నటేష్, ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘సుర సుర’ అనే ఫోక్ సాంగ్ మాస్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చీకటికి, వెలుగుకు మధ్య జరిగే పోరాటాన్ని అద్భుతమైన వీఎఫ్ఎక్స్, ఆర్ట్ వర్క్‌తో అత్యంత రిచ్‌గా తెరకెక్కించారు.

సోషల్ మీడియాలోనూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, విజువల్స్ చూసి ప్రేక్షకులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. జూలై 3న రాబోతున్న ఈ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద మొదటి ఆటతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. ఒక యంగ్ హీరో, వినూత్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ‘నాగబంధం’ టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిందే!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com