Home

»

Latest News

Nagabandham: నాగబంధం ఫస్ట్ డే కలెక్షన్స్.. ట్రేడ్ వర్గాలు సైతం షాక్!

Jul 4, 2026 10:00AM

 

భారీ అంచనాల నడుమ నిన్న వరల్డ్ వైడ్ గా  'నాగబంధం' థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. విరాట్ కర్ణ, నభానటేష్, జగపతి బాబు,  రిషభ్ సావ్నీ, మహేష్ మంజ్రేకర్, మురళిశర్మ  కీ రోల్స్ కాగా అభిషేక్ నామా దర్శకత్వంలో  సుమారు 110 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు మిశ్రమ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ, విడుదలకు ముందు క్రియేట్ అయిన హైప్ మరియు ఆకర్షణీయమైన టీజర్, ట్రైలర్ల కారణంగా ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదనిపించింది. 


మొదటి రోజు ఇండియా వైడ్ గా 3.25 కోట్ల రూపాయల నెట్ వసూళ్లని సాధించి ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరిచింది. దేశవ్యాప్తంగా మొత్తం 3,202 షోలలో ప్రదర్శించబడిన ఈ చిత్రం తొలిరోజే థియేటర్లలో 22 శాతం సగటు ఆక్యుపెన్సీని నమోదు చేయడం విశేషం. గ్రాస్ వసూళ్ల పరంగా చూస్తే  3.74 కోట్ల రూపాయలను రాబట్టింది. లాంగ్వేజెస్  వారీగా కలెక్షన్ల వివరాలని పరిశీలిస్తే, తెలుగులోనే అత్యధిక వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ ద్వారా 2.90 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లని సాధించింది. ఇతర భాషలలో హిందీ వెర్షన్ 20 లక్షల రూపాయలు, తమిళ వెర్షన్ 10 లక్షల రూపాయలు రాబట్టగా, మలయాళం నుంచి 3 లక్షలు, కన్నడ వెర్షన్ నుండి 2 లక్షల రూపాయల చొప్పున వసూళ్లు వచ్చాయి. 


 ప్రేక్షకుల రాకను గమనిస్తే తెలుగు వెర్షన్ 24.87 శాతం ఆక్యుపెన్సీతో అగ్రస్థానంలో నిలిచింది. ఉదయం షోలకు 19.46 శాతం ఆక్యుపెన్సీ ఉండగా, మధ్యాహ్నానికి 24.15 శాతానికి పెరిగింది. సాయంత్రం షోలలో 23.92 శాతంగా స్థిరంగా సాగి, రాత్రి షోల సమయానికి ఏకంగా 31.92 శాతం ఆక్యుపెన్సీతో అత్యధిక జనాలను ఆకర్షించింది. ఇతర భాషల్లో కన్నడ వెర్షన్ 17.38 శాతం, హిందీ 12.53 శాతం, తమిళం 10.90 శాతం మరియు మలయాళం 4.30 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేశాయి.  సినిమా వ్యాపార లెక్కల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 22 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరుపుకోగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ భారీ ప్రాజెక్ట్ బ్రేక్ ఈవెన్ మార్కుని  అందుకోవాలంటే దాదాపు 65 కోట్ల రూపాయల షేర్ వసూళ్లని  సాధించాల్సి ఉంటుంది. మరి వీకెండ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్, యువత థియేటర్లకి ఎంతవరకు వస్తారనే దానిపైనే  'నాగబంధం'మనుగడ ఆధారపడి ఉంటుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com