
సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత నాగ వంశీకి చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ నెల 10 న అఖిల్ అక్కినేని వన్ మాన్ షో లెనిన్ తో వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టనున్నాడు. తను నిర్మించిన చిత్రాలే కాకుండా ఇతర లాంగ్వేజ్ సినిమాలని కూడా రిలీజ్ చేస్తాడనే విషయం తెలిసిందే. ఆ కోవలోనే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి కీ రోల్స్ పోషించిన 'బ్లాస్ట్ జోన్' ని కూడా రిలీజ్ చేసాడు. సుభాష్ కె. రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం రూ. 18 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ. 74.85 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-3 తమిళ చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అయితే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినా, తెలుగులో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఆశించిన స్థాయిలో ఎందుకు ప్రమోట్ చేయలేదు అనే ప్రశ్న సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై నాగవంశీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ అసలు నిజాలను బయటపెట్టారు.
నేను కావాలనే 'బ్లాస్ట్ జోన్' ప్రమోషన్ల విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బ్లాస్ట్ జోన్ విడుదలైన సమయంలోనే 'పెద్ది' థియేటర్లలోకి వచ్చింది. 'పెద్ది' నిర్మాత సతీష్ కిలారు నాకు అత్యంత ఆప్తమిత్రుడు. పైగా ఆ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రం కావడం వల్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. ఒకవేళ ఆ సమయంలో నేను 'బ్లాస్ట్ జోన్' చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసి ఉంటే, ఇండస్ట్రీలో అనవసరపు వివాదాలు వచ్చేవి. నాగవంశీ కావాలనే మెగా ఫ్యామిలీ సినిమాని టార్గెట్ చేస్తున్నాడు, దానికి పోటీగా ఈ చిన్న డబ్బింగ్ సినిమాని నిలబెట్టి డ్యామేజ్ చేస్తున్నాడు' అంటూ గాసిప్స్ సృష్టించేవారు. ఒకవేళ 'పెద్ది' విడుదలయ్యాక ప్రమోషన్లు గట్టిగా చేసి ఉంటే, ఆ సినిమా కలెక్షన్లని దెబ్బతీయడానికే ఇప్పుడు పబ్లిసిటీ చేస్తున్నావా అని విమర్శించేవారు. అందుకే సైలెంట్‌గా ఉండటమే సేఫ్ గేమ్ అని భావించాను.
Also read: lenin: లెనిన్ థియేటర్ల వేట.. బాక్సాఫీస్ వద్ద ఊరమాస్ జాతర!
బ్లాస్ట్ జోన్ రెండు వారాల ముందే విడుదలై ఉంటే తెలుగు బాక్సాఫీస్ వద్ద మరింత మెరుగైన వసూళ్లు సాధించేది. అయినప్పటికీ, ఎలాంటి భారీ హంగామా లేకపోయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నా ఇంకా మంచి రెస్పాన్స్ వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. బ్లాస్ట్ జోన్ మే 28 న థియేటర్స్ లోకి రాగా, పెద్ది జూన్ 4 న రిలీజైన విషయం తెలిసిందే.





