
రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ మోస్ట్ 'ఫౌజీ'. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత హై బడ్జెట్ వాల్యూతో 'సీతారామం' దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తుండగా అభిమానులు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చారిత్రక నేపథ్యంతో, యుద్ధం ప్రేమ అనే బలమైన భావోద్వేగాల చుట్టూ తిరిగే కధాంశాలతో తెరకెక్కుతుంది. తాజాగా ఫౌజీ' పై స్టార్ ప్రొడ్యూసర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ 'ఫౌజీ' నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ నాకు 'ఫౌజీ'కి సంబంధించిన కొన్ని కీలక రషెస్ (షూటింగ్ విజువల్స్) చూపించారు. ఆ విజువల్స్ చూసినప్పుడు నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. స్క్రీన్ మీద విజువల్స్ అంత అద్భుతంగా, రిచ్‌గా వచ్చాయి , హను రాఘవపూడి మేకింగ్ స్టైల్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. మనం ఊహించని స్థాయిలో, హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌లా రూపొందిస్తున్నారు అంటూ చిత్రబృందాన్ని ప్రశంసించారు. సాధారణంగా ప్రతి సినిమాను ఎంతో నిశితంగా గమనించే నాగవంశీ లాంటి అగ్ర నిర్మాత ఈ స్థాయి ఎలివేషన్ ఇవ్వడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా చేస్తుంది.
Also read: Lenin: లెనిన్ మూవీతో భాగ్యశ్రీ బోర్సే తొలి మైల్‌స్టోన్ హిట్ అందుకోబోతుందా!
డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ శరవేగంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకునట్టుగా తెలుస్తుంది. టీజర్ అండ్ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన మెలోడీలతో పాటు అంతకు మించిన గ్రాండియర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Naga vamsi, prabhas, fauzi, hanuraghavapudi






