చైతూ వెబ్-సిరీస్ కి ముహూర్తం ఫిక్స్!
on Sep 17, 2021
యువ సామ్రాట్ నాగచైతన్య తాజా చిత్రం `లవ్ స్టోరి` ఈ నెల 24న విడుదలకు సిద్ధమైంది. ఆపై తక్కువ గ్యాప్ లోనే `థాంక్ యూ`, `లాల్ సింగ్ చద్ధా` (హిందీ) సినిమాలతో సందడి చేయనున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా ఏడాది చివరలోనే తెరపైకి రాబోతున్నాయి.
ఇదిలా ఉంటే.. చైతూ ఓ వెబ్ - సిరీస్ చేయబోతున్నట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. హారర్ థీమ్ తో తెరకెక్కనున్న ఈ సిరీస్ ని వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ రూపొందించబోతున్నారు. కాగా, ఈ సిరీస్ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని డిసెంబర్ నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆపై చకచకా చిత్రీకరణ పూర్తిచేసి వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ చేయబోతున్నట్లు వినికిడి. మరి.. తన డెబ్యూ వెబ్ - సిరీస్ తో నాగచైతన్య ఎలాంటి గుర్తింపుని పొందుతాడో చూడాలి.
కాగా, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ నటించిన `మనం` మంచి విజయం సాధించగా.. చిత్రీకరణ దశలో ఉన్న `థాంక్ యూ` వారిద్దరి కాంబోలో సెకండ్ ప్రాజెక్ట్. ఇక ఈ వెబ్ - సిరీస్ తో హ్యాట్రిక్ ఎటెంప్ట్ చేస్తున్నట్లవుతోంది.