Home

»

Latest News

ప్రేమ‌మ్‌.. లాభ‌మ్‌

Oct 8, 2016 11:46AM


నాగ‌చైత‌న్య కెరీర్ డీసెంట్‌గానే సాగుతుంది. పేరున్న ఇంటి నుంచి వ‌చ్చిన హీరో అయినా.. ఎప్పుడూ అదిరిపోయే ఓపెనింగ్స్ రాలేదు. సినిమా బాగుంది అనే టాక్ వ‌స్తే.. అప్పుడు థియేట‌ర్లు నిండేవి. కానీ ప్రేమ‌మ్ మాత్రం ఆ సెంటిమెంట్‌ని క్రాస్ చేసింది. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమాకి అన్ని చోట్లా మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. మ‌రీ ముఖ్యంగా ఓవ‌ర్సీస్‌లో దుమ్ము దులిపేసింది.  యు.యస్ లో 120 లొకేషన్స్ లో  ప్రీమియర్ షోలు ప‌డ్డాయి. దాదాపుగా $74.219 డాలర్లు వ‌సూలు చేసినట్టు స‌మాచారం. చైతూ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇదే. ఆంధ్రా, తెలంగాణ‌ల్లోనూ మంచి ఓపెనింగ్సే వ‌చ్చాయి. శుక్ర‌వారం ప్రేమ‌మ్‌తో పాటు మ‌రో మూడు సినిమాలు విడుల‌య్యాయి. వాటిలో దేనికీ లేన‌న్ని వ‌సూళ్లు ప్రేమ‌మ్ ద‌క్కించుకొంది. ఓవ‌ర్‌ఫ్లోస్ మాత్రం.. మిగిలిన సినిమాలు పంచుకొన్నాయి. ఇది ద‌స‌రా సీజ‌న్ కాబ‌ట్టి ఈ సీజ‌న్‌ని ప్రేమ‌మ్ ఫుల్ గా క్యాష్ చేసుకొనేట్టు ఉంది. తొలి వారంతో దాదాపు రూ.10 కోట్లు వ‌సూలు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.  ఓవ‌ర్సీస్‌, శాటిలైట్ హ‌క్కులు అన్నీ క‌లుపుకొని రూ.25 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసే అవ‌కాశం ఉంది. రూ.18 కోట్ల‌తో పూర్త‌యిన సినిమా ఇది. పాతిక కోట్లంటే ప్రేమ‌మ్ లాభాలు సంపాదించిన‌ట్టే క‌దా??

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com