Home

»

Latest News

నాగచైతన్య హీరోగా శ్యాంప్రసాదరెడ్డి చిత్రం

Apr 27, 2011 3:12PM

నాగచైతన్య హీరోగా శ్యాంప్రసాదరెడ్డి చిత్రంయువ హీరో, అక్కినేని వంశ నట వారసుడు అయిన నాగచైతన్య ఆయన నిర్మించే చిత్రంలో హీరోగా నటించనున్నారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. నాగచైతన్య ప్రస్తుతం కామాక్షీ కళా మూవిస్ పతాకంపై, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, డి.శివప్రసాద రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత ఆయన శ్యాం ప్రసాద రెడ్డి నిర్మించబోయే చిత్రంలో నటించటానికి అంగీకరిస్తారు.

"మే" నెలలో ఆరవ తేదీన, నాగచైతన్య హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ పతాకంపై, బన్నీ వాసు నిర్మించిన "100% లవ్" చిత్రం విడుదల కానుంది. నాగచైతన్య హీరోగా, శ్యాంప్రసాద రెడ్డి నిర్మించబోయే చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com