Home

»

Latest News

పూజలో కూర్చుంటే మతం మారినట్లేనా..?

Oct 1, 2016 4:32PM

ఇంకా పెళ్లయితే కాలేదు కాని అప్పుడే సమంతపై ఈగ కూడా వాలనివ్వడం లేదు నాగచైతన్య. అసలు మ్యాటర్‌లోకి వెళితే గత కొన్ని రోజులుగా సమంత మతం మార్చుకుంది..కావాలంటే ఈ ఫోటోలు చూడండి అంటూ మీడియాలో కొన్ని పిక్స్ షికారు చేస్తున్నాయి. బై బర్త్ క్రీస్టియన్‌గా ఉన్న సమంత, చైతూతో పెళ్లి కోసం హిందూ మతాన్ని స్వీకరించిందని అందుకే కొన్ని రకాల పూజలు చేసిందని..నాగార్జున దగ్గరుండి ఈ తంతు జరిపించారని సోషల్ మీడియాలోనూ..వెబ్ మీడియాలోనూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వీటిపై స‌మంత సీరియ‌స్ అవుతున్న‌ట్టు టాక్‌. `నేను మ‌తం మార్చుకోవ‌డం ఏంటి.. నాన్సెన్స్‌` అంటూ స‌న్నిహితుల ద‌గ్గ‌ర వాపోతోంద‌ట‌. అంతేకాదు.. ఇలాంటి వార్త‌ల‌కు చెక్ పెట్టాల‌ని చూస్తోంద‌ట‌. అందుకే త‌న పెళ్లి పూర్తిగా క్రైస్త‌వ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌ర‌పాల‌ని కోరుకొంటోంద‌ని తెలుస్తోంది.

ఈ విషయంలో తన కాబోయే భార్యకు మద్ధతు తెలిపాడు చైతూ. సమంత మతం మార్చుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవాలని..అసలు అలాంటి ఉద్దేశం తమకు లేదన్నాడు. ఆ ఫోటోలు అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన మామూలు పూజకు సంబంధించినవే అని చెప్పాడు. స్టూడియోలో నాన్నగారు ఏదో పూజ చేసుకుంటుంటే..సరిగ్గా అదే సమయానికి మేమిద్దరం వెళ్లాం. దీంతో సమయానికి వచ్చారు కదా అని మమ్మల్ని కూడా పూజలో కూర్చోమన్నారు. దాంతో ఇద్దరం పూజలో కూర్చున్నామన్నాడు. తనకు ఏ మతమైనా ఓకే అని..వ్యక్తిని ప్రేమిస్తాను తప్ప మతాన్ని మార్చుకోమనడం లాంటి కండిషన్స్ పెట్టనని స్పష్టంగా చెప్పాడు చైతూ.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com