Home

»

Latest News

నాగచైతన్య పెళ్లి కూతురు మారింది...

Jul 16, 2016 10:33AM

టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయుడు నాగచైతన్య, సమంతల ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడటం.. వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో డిసెంబర్‌లో ఈ జంట ఒక్కటి కాబోతోంది. దీంతో వీరిద్దరూ మ్యారేజ్‌పై తెగ కలలు కంటున్నారు. ఈ క్రమంలో నాగార్జునకు సోగ్గాడే చిన్నినాయన వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య ఒక సినిమా తీయబోతున్నాడు. ఈ సినిమాలో ఫస్ట్ సమంతను హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే సమంతా-చైతూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోవడంతో హీరోయిన్‌గా సమంతను తప్పించి ఆమె స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకున్నారు. అంటే ఈ ప్రాజెక్ట్‌లో సమంతకు బదులు రకుల్‌తో చైతన్య రోమాన్స్ చేయబోతున్నాడన్న మాట. పెళ్లి టైం దగ్గర పడుతుండటంతో సినిమాల జోరు తగ్గించుకుని ఇప్పటి నుంచే హౌజ్ వైఫ్‌లా ఎలా ఉండాలా అన్న దానిపై సమ్మూ కుస్తీ పడుతున్నట్టు తెలుస్తోంది. బుక్స్ చదువుతూ, కిచెన్‌లో గరిటె తిప్పుతూ బిజీగా ఉందట సమంత.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com