Home

»

Latest News

చైతూ డ‌బుల్ హ్యాట్రిక్ ప్లాన్!

Jan 19, 2022 11:46AM

రీసెంట్ టైమ్స్ లో యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య ప‌ట్టింద‌ల్లా బంగార‌మే. `మ‌జిలీ`, `వెంకిమామ‌`, `ల‌వ్ స్టోరి`, `బంగార్రాజు`.. ఇలా త‌న కెరీర్ లో ఎన్న‌డూ లేని విధంగా నాలుగు వరుస విజ‌యాలు చూశాడు చైతూ. అంతేకాదు.. వీట‌న్నింటిలోనూ అభిన‌యానికి ఆస్కార‌మున్న పాత్ర‌ల్లో క‌నిపించి న‌టుడిగానూ మెప్పించాడు. కాగా, వీటిలో `మ‌జిలీ`, `ల‌వ్ స్టోరీ` సోలో హీరో సినిమాలు కాగా.. `వెంకిమామ‌`, `బంగార్రాజు` మ‌ల్టిస్టార‌ర్స్ కావ‌డం గ‌మ‌నార్హం.

Also Read:  రుద్రాణి చెంప ప‌గ‌ల‌గొట్టిన సౌంద‌ర్య‌

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒక‌టి `థాంక్యూ` కాగా.. మ‌రొక‌టి హిందీ చిత్రం `లాల్ సింగ్ చ‌ద్ధా`. వీటిలో `థాంక్యూ` చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌లో ఉండ‌గా.. `లాల్ సింగ్ చ‌ద్ధా` ఏప్రిల్ 14న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. `థాంక్యూ`లో సోలో హీరోగా న‌టిస్తున్న నాగ‌చైత‌న్య‌.. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ష‌నిస్ట్ ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ ప్లే చేసిన `లాల్ సింగ్ చ‌ద్ధా`లో ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. త‌క్కువ గ్యాప్ లోనే రాబోతున్న `లాల్ సింగ్ చ‌ద్ధా`, `థాంక్యూ` కూడా విజ‌యం సాధిస్తే.. నాగ‌చైత‌న్య కెరీర్ లో ఓవ‌రాల్ గా డ‌బుల్ హ్యాట్రిక్ క్రెడిట్ అయిన‌ట్టే. మ‌రి.. చైతూ `డ‌బుల్ హ్యాట్రిక్` అందుకుంటాడో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com