Home

»

Latest News

ఏప్రిల్‌ 24న ‘దోచేయ్‌’

Apr 1, 2015 7:30PM

ఏమాయ చేసావె, 100% లవ్‌, తడాఖా, మనం వంటి సూపర్‌హిట్‌ చిత్రాల హీరో యువసామ్రాట్‌ నాగచైతన్య కథానాయకుడిగా, 1 నేనొక్కడినే ఫేం కృతి సనన్‌ హీరోయిన్‌గా, స్వామిరారా వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ‘దోచేయ్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్‌ 24న సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ కాబోతోంది.


ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నాగచైతన్య హీరోగా స్వామిరారా టీమ్‌తో మా బేనర్‌లో నిర్మిస్తున్న ‘దోచేయ్‌’ చిత్రాన్ని ఏప్రిల్‌ 24న సమ్మర్‌ స్పెషల్‌గా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. అలాగే ఏప్రిల్‌ రెండోవారంలో లహరి మ్యూజిక్‌ ద్వారా ఈ  చిత్రం ఆడియోను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 1 వరకు రోజుకొకటి చొప్పున విడుదల చేసిన సాంగ్స్‌కి, టీజర్స్‌కి చాలా ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యేలా, మా బేనర్‌ ప్రతిష్టను మరింత పెంచేలా సుధీర్‌వర్మ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా ‘దోచేయ్‌’ నిలుస్తుంది’’ అన్నారు.

యువసామ్రాట్‌ నాగచైతన్య సరసన కృతి సనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావు రమేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com