Home

»

Latest News

'బంగార్రాజు'లో నాన్నది గెస్ట్ రోల్ కాదు

Jan 12, 2022 3:06PM

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'బంగార్రాజు'. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుద‌లకానుంది. ఈ సంద‌ర్భంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన నాగచైతన్య ప‌లు ఆసక్తికర విష‌యాల‌ను పంచుకున్నారు.

"'మనం' సినిమా టైంలో తాతగారు, నాన్నతో కలిసి చేసేటప్పుడు భయం ఉండేది. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు 'బంగార్రాజు'కి ఆ భయం కొంచెం పోయింది. బాగా ఓపెన్ అయ్యి ఎనర్జీతో చేశాను. ఇది నేను చేసిన ఫస్ట్ సీక్వెల్ మూవీ. దానికితోడు సోగ్గాడే సినిమాతో ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ అయిపోయింది. అందుకే చాలా హోమ్ వర్క్ చేశాను. బాడీ ల్యాంగ్వేజ్ కోసం సోగ్గాడే సినిమా చాలాసార్లు చూశాను. కొన్ని సీన్స్ లో డైలాగ్స్ నాన్నని చెప్పమని, ఆ వాయిస్ రికార్డుతో ప్రాక్టీస్ చేశాను. సినిమాలో ఎంటర్టైన్ మెంట్ ఎక్కడా తగ్గదు. పక్కా పండగ సినిమా. ముందు నుండి సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకున్నాం." అని చెప్పారు.

"సినిమాలో నా రోల్ ఎక్కువ ఉంటుంది అన్నట్లుగా ట్రైలర్ కట్ చేశారు. కానీ నాన్నది, నాది ఇద్దరి రోల్స్ ఈక్వల్ గా ఉంటాయి. నాన్నది గెస్ట్ రోల్ కాదు. చెప్పాలంటే నాన్నదే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అసలు బంగార్రాజు ఆయనేగా. చిన్న బంగార్రాజుగా నా రోల్ అదనపు ఆకర్షణ అంతే. సోగ్గాడేలో ఉన్న రాము క్యారెక్టర్ 'బంగార్రాజు'లో ఉంటుంది. కానీ మాకు కాంబినేషన్ సీన్స్ ఉండవు. యూఎస్ లో ఉండి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అంతే. కృతి శెట్టి రోల్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. మూడో సినిమాకే ఆమె డెడికేషన్ కి హ్యాట్సాఫ్. సినిమాలో అన్ని సాంగ్ బాగున్నాయి. దక్ష నగార్కర్, నేను కలిసి చేసిన సాంగ్ బాగుంటుంది. మూవీలో ఫస్ట్ వచ్చే సాంగ్ అదే. ఫైట్స్ చాలా బాగుంటాయి మూవీలో. నాన్న నా బాడీలో ఉండి చేసే ఫైట్ హైలైట్ గా ఉంటుంది." అని చైతన్య చెప్పుకొచ్చారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com