Home

»

Latest News

ఇస్మార్ట్ హీరోయిన్ దొరికింది!!

Jan 28, 2019 12:27PM

 

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా డాషింగ్ డైర‌క్ట‌ర్ పూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఇటీవ‌లే ఈచిత్రం షూటింగ్ ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ ని గ‌త నెల రోజులుగా సెర్చ్  చేస్తున్నారు. ఎంతో మంది హీరోయిన్ల‌ను చూసిన పూరి జ‌గ‌న్నాథ్ ఫైన‌ల్ గా న‌భా న‌టేష్ ని ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ అమ్మ‌డు న‌న్ను దోచుకుందువటే చిత్రంతో త‌న ప‌ర్ఫార్మెన్స్ తో  ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకుంది. ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `అదిగో` చిత్రంలోనూ న‌టించింది. ప్ర‌జంట్ ర‌వితేజ్ స‌ర‌స‌న  న‌టిస్తోంది. పూరి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా అన‌గానే ఎగిరి గెంతేసింద‌ట న‌భా న‌టేష్‌.

హైద‌రాబాదీ స్టైల్లో రామ్ న్యూ లుక్ లో క‌నిపించ‌నున్నాడు. పూరి , చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని స‌మ‌కూరుస్తుండ‌గా `అర్జున్ రెడ్డి` ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ ఏడాది మేలో నే సినిమాను రిలీజ్ చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com