
మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘మండాడి’. ఈ సినిమాలో సుహాస్, సూరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ అందరినీ మెప్పించింది. సుహాస్, సూరి పాత్రలు, ఆ కారెక్టర్స్ మేకోవర్ అదిరిపోయింది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టీం నమ్మకంగా చెబుతోంది. బోట్ సీక్వెన్స్ లు అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటాయని ఆల్రెడీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే.
‘మండాడి’ మూవీ సెప్టెంబర్ 10న థియేటర్లలో అడుగు పెట్టనుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీస్ రిలీజ్ చేయబోతోంది. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ భారీ ఎత్తున విడుదల చేయనుంది.

ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ప్రొడక్షన్ డిజైన్ గా డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్ గా ప్రదీప్ ఇ. రాఘవ్ వ్యవహరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు.
Suhas, Mandaadi, Telugu Release, Mythri Movie Distributors






