Home

»

Latest News

మెగా ఫ్యాన్స్‌కి బిగ్ షాక్: చివరి నిమిషంలో చిరంజీవి సినిమా వాయిదా.!

Aug 20, 2026 3:24PM

మెగాస్టార్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. థియేటర్లలో రచ్చ చేద్దాం అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కి బిగ్ షాక్ ఇస్తూ 'ముఠా మేస్త్రి' 4K రీ-రిలీజ్ వాయిదా పడింది.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ మాస్ బ్లాక్‌బస్టర్ మూవీ 'ముఠా మేస్త్రి'. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సృష్టించిన సునామీ, ఆ మాస్ మేనియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆల్‌టైమ్ క్లాసిక్‌ను 4K క్వాలిటీలో, అత్యుత్తమ 5.1 ఆడియో సౌండింగ్‌తో థియేటర్లలోకి మళ్ళీ తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇటీవల విడుదలైన రీ-రిలీజ్ ట్రైలర్‌కు కూడా మెగా ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

థియేటర్లలో మేస్త్రి మాస్ జాతరను మళ్ళీ రిపీట్ చేసేందుకు అంతా సిద్ధమవుతున్న సమయంలో, మేకర్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఈ రీ-రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 4K క్వాలిటీ రీ-మాస్టరింగ్ వర్క్‌కు సంబంధించి ఫైనల్ క్వాలిటీ అవుట్‌పుట్ రావడంలో సాంకేతిక జాప్యం జరిగిందని మేకర్స్ తెలిపారు.

ఈ సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్‌కు ఒక ఎమోషనల్ నోట్ రాశారు. "ముఠా మేస్త్రి అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అది తరతరాల మెగా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఒక పవర్ ఫుల్ మాస్ క్లాసిక్" అని కొనియాడారు. ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా, అభిమానులకు అత్యుత్తమ బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, నాణ్యత విషయంలో తాము ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని స్పష్టం చేశారు.

ఈ నిర్ణయం వల్ల మెగా అభిమానులు కొంత నిరాశకు గురైనప్పటికీ, చిరంజీవి రేంజ్‌కి తగ్గట్లుగా ముఠా మేస్త్రి రీ-రిలీజ్ గ్రాండ్‌గా ఉండబోతోందని మేకర్స్ హామీ ఇచ్చారు. త్వరలోనే రీ-రిలీజ్ చేయడానికి కొత్త తేదీని అధికారికంగా ప్రకటిస్తామని తెలియజేశారు. బిగ్గర్, బెటర్, గ్రాండర్ ఎక్స్‌పీరియన్స్‌తో మేస్త్రి మళ్ళీ థియేటర్లలోకి రాబోతున్నాడు.

 

 

 

Muta Mestri 4K, Chiranjeevi, Birthday

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com