
-మాజీ ప్రియుడు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మృణాల్ ఠాకూర్
-ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగాను
-ఆ విషయంలో పెంచడమే కాదు, మళ్ళీ తగ్గించాడు
ఈ మధ్య కాలంలో అప్ కమింగ్ మూవీస్ కి సంబంధించిన విషయాల కంటే పర్సనల్ మ్యాటర్స్ ని షేర్ చేసుకుంటు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). అభిమానులు మాత్రం తన డేర్ ని మెచ్చుకుంటు రాబోయే చిత్రాల్లో మృణాల్ పెర్ఫార్మ్ చూడాలనే కుతూహలంతో ఉన్నారు. ఈ విషయంలో అభిమానులు వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా తన ఆధీనంలో ఉంచుకుంది. ఈ మధ్య కాలంలో ఆ రకమైన అభిమానం మృణాల్ కి మాత్రమే దక్కిన గౌరవంగా భావించవచ్చు . రీసెంట్ గా మృణాల్ మరో సారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి. తను ఏం చెప్తుందో చూద్దాం.
ఆమె మాట్లాడుతు హృతిక్ రోషన్(Hrithik Roshan)సార్ తో కలిసి సూపర్ 30 మూవీ చేసే టైంలో నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ చాలా టెన్షన్ పడ్డాడు. ఎక్కడ తనని వదిలేస్తానేమో అనేది అతని భయం. దీంతో జిమ్ కి వెళ్లి కండలు పెంచి ఇరవై కిలోల బరువు తగ్గాడు. కానీ కొన్ని రోజులకి జిమ్ మానేసి బరువు పెరిగాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాను.నీ చుట్టూ ఉండే సినిమా వాళ్ళతో పోటీపడాలని అనుకుంటున్నా. కానీ నా వల్ల కావడం లేదు అని చెప్పాడు. దీంతో నేను ఎంత నిజాయితీగా ఉన్నా ఆ రిలేషన్ ముందుకు వెళ్లలేకపోయింది. ఫిట్ నెస్ విషయంలో ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఎంత ఒత్తిడికి గురవుతారో అతన్ని చూసాకే అర్థమైందని చెప్పుకొచ్చింది.
also read: రంభ రీ ఎంట్రీ.. ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది
కొన్ని రోజుల క్రితమే మృణాల్ తన మరో బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతు 'నేను యాక్ట్ చేయడం ఇష్టం లేకపోవడంతో బ్రేక్ అప్ చెప్పినట్టుగా వెల్లడి చేసింది.ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఎవరనే క్యూరియాసీటీ నెలకొని ఉన్న నేపథ్యంలో అభిమానులు తమ మెదళ్ళకి పని చెప్పారు.తన అప్ కమింగ్ మూవీస్ విషయానికి వస్తే తెలుగులో అడవి శేష్(Adivi Sesh)సరసన డెకాయిట్(Dacoit)తో జత కడుతుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో మృణాల్ క్యారక్టర్ ఒక రేంజ్ లో ఉండబోతుందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. హిందీలోను రెండు భారీ చిత్రాలని తన చేతుల్లో ఉంచుకుంది. అల్లు అర్జున్(Allu Arjun),అట్లీ(Atlee)ప్రాజెక్ట్ లో ఉందనేది చాలా రోజుల నుంచి వినిపిస్తున్న టాక్.









