Home

»

Latest News

ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్ సక్సస్ టూర్

Apr 28, 2011 11:58AM

ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం యూనిట్ సక్సస్ టూర్ చేపడుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన చిత్రం "మిస్టర్ పర్ ఫెక్ట్". "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించి, విశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శించబడుతూండటంతో, ఈ చిత్రం యూనిట్ సక్సస్ టూర్, విజయ యాత్ర చేయాలనుకుంటూంది. "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం విజయయాత్ర రాయల సీమ లోని మదనపల్లి నుండి ప్రారంభమై తిరుపతి,కదిరి, అనంతపురం, తాడిపత్రి, కడప, తదితర సెంటర్ల మీదుగా సాగుతుంది.

అసలు మదనపల్లి నుండి "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్ర విజయ యాత్ర చేయటానికి గల ప్రత్యేక కారణమేంటని నిర్మాత దిల్ రాజుని ప్రశ్నిస్తే "మా "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం తొలి షో మదనపల్లిలోనే పడింది. హిట్ టాక్ కూడా అక్కడి నుండే మొట్టమొదట నాకు అందింది" అని సమాధానం చెప్పారు. అలాగే "మిస్టర్ పర్ ఫెక్ట్" ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ని విశాఖపట్టణం రామకృష్ణ బీచ్ లో అత్యంత వైభవంగా జరపటానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com