Home

»

Latest News

మిస్టర్ లవంగం ఆడియో రిలీజ్

Apr 7, 2011 12:16PM

teja tanikella wallpapers, teja tanikella stills, teja tanikella images, teja tanikella pics, teja tanikella photos, teja tanikella pictures"మిస్టర్ లవంగం" చిత్రం యొక్క ఆడియో రిలీజ్ చేయబడింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు అయిన తనికెళ్ళ భరణి కుమారుడు తేజ తనికెళ్ళ తొలిసారి హీరోగా నటిస్తూండగా, చలపతి మల్లాదిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆర్.కె.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, నూతన నిర్మాత ఎ.కె.సాయికుమార్ నిర్మిస్తున్న చిత్రం"మిస్టర్ లవంగం". ఈ చిత్రంతో ఎ.కె.రిషాల్ సాయి సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు.


ఈ చిత్రం ఆడియో ఏప్రెల్ 6 వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్ సినీ మ్యాక్స్ లో, రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి చేతుల మీదుగా సీనియర్ నటులు చలపతిరావు తొలి సి.డి.ని అందుకోగా, మధుర ఎంటర్ టైన్ మెంట్స్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయబడింది. ఈ ఆడియో విడుదలకు సినీ నటులు శివాజీరాజా, కొండవలస లక్ష్మణరావు, నటి ఉమ, తనికెళ్ళ భరణి, చలపతిరావు, శ్రీహరి తదితరులు హాజరై ఈ చిత్రం యూనిట్ కు తమ శుభాభినందనలు తెలియజేశారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com