'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఫస్ట్ స్టెప్ ఇలా ఉంది!
on Feb 8, 2020
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తోన్న నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' ఫస్ట్ లుక్ విడుదలైంది. చాలా కాలం గ్యాప్‌తో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో అఖిల్ సరసన నాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ లుక్‌లో ఎక్కడో ఫారిన్ ప్లేస్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు అఖిల్. తలకు మంకీ క్యాప్‌తో అల్ట్రా మోడరన్ లుక్‌లో ఉన్న అతడి కాళ్లకు చెప్పులు లేకపోవడం ఆసక్తికరం. టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు మిశ్రమ స్పందన ఎలా వచ్చిందో, ఈ ఫస్ట్ లుక్కు కూడా అదే తరహాలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఒకరు "హిట్టు కొట్టాలి అఖిలు" అని స్పందిస్తే, "నువ్వు చాలా అందగాడివి. కానీ ఈ లుక్ డిజప్పాయింట్ చేసింది" అని మరొకరు స్పందించారు. "మీరు ఎంత కష్టపడి సినిమా చేసినా ఇలాంటి నాసిరకం పోస్టర్స్ & ప్రమోషన్స్ వల్ల అంతా వేస్ట్. బాబూ.. మంచి డేట్‌కి రండి. ప్రమోషన్స్ జాగ్రత్తగా చేసుకోండి" అని ఒకరు సలహా ఇస్తే, "సెవెన్స్ స్టెప్స్ అనే కాన్సెప్ట్ ఫెంటాస్టిగ్గా ఉంది" అని మరొకరు మెచ్చుకున్నారు.
ఈ ఫస్ట్ లుక్‌ను 'ఫస్ట్ స్టెప్'గా మేకర్స్ అభివర్ణిస్తున్నారు. అఖిల్ సైతం తన ట్విట్టర్ హ్యాండిల్లో "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సెవెన్ స్టెప్స్‌లో ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఏప్రిల్‌లో థియేటర్ల దగ్గర కలుద్దాం" అని ట్వీట్ చేశాడు. అంటే ఈ సినిమా ప్రమోషన్‌ను ఈ ఫస్ట్ లుక్‌తో మొదలుపెట్టారు కాబట్టి దీన్ని 'ఫస్ట్ స్టెప్' అని సంబోధించారన్న మాట. సినిమా రిలీజయ్యేలోగా మిగతా 'సిక్స్ స్టెప్స్'ను వేస్తారు. ఆ స్టెప్స్ ఏమిటన్నవి ఒక్కొక్కటిగా మనం చూడబోతున్నాం. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
హైదరాబాద్, అమెరికా తదితర ప్రాంతాల్లో ఇప్పటికే షెడ్యూల్స్ జరుపుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 15 నుంచి మరో షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్లో మేజర్ టాకీ పార్ట్ పూర్తిచేస్తామని చిత్ర బృందం చెబుతోంది. ఇదే బ్యానర్లో ఇదివరకు వచ్చిన 'గీత గోవిందం' సినిమాకు బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన గోపిసుందర్, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' కోసం ఆరు పాటలకు బాణీలు అందించాడు. వాటిలో ఇప్పటికే నాలుగు పాటలను షూట్ చేశారు. మిగిలిన రెండు పాటల్ని ఫారిన్లో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు.
కాగా ఇప్పటివరకు చేసిన మూడు సినిమాలు ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో అల్లు అరవింద్ బ్యానర్ అయినా తనకు హిట్నిస్తుందనే ఆశతో ఉన్నాడు అఖిల్. అతను ఇదివరకు చేసిన 'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్ను' సినిమాల్లో ఏ ఒక్కటీ హిట్ అనిపించుకోలేకపోయింది. అందుకే ఆడియెన్స్‌లో అఖిల్‌కు ఇంతదాకా క్రేజ్ రాలేదు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'గానైనా అతడికి బొమ్మరిల్లు భాస్కర్ హిట్టునిస్తాడేమో చూడాలి.
Also Read