Home

»

Latest News

షాకింగ్ నిజాలు బయటపెట్టిన మోహన్ బాబు ఇంటి పనిమనిషి

Dec 10, 2024 3:39PM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu)ఆయన రెండవ కుమారుడు ప్రముఖ హీరో మనోజ్(manoj)మధ్య ఆస్తులకి సంబంధించిన గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.మోహన్ బాబు అయితే ఏకంగా  మనోజ్ వల్ల ప్రాణ హాని ఉందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగగా, మనోజ్ మాత్రం తనకి ఆస్తులపై వ్యామోహం లేదని, తన భార్య,కూతురు పై కుట్ర పన్నుతున్నారని మీడియా ముఖంగా  చెప్పడం జరిగింది.

రీసెంట్ గా మోహన్ బాబు ఇంట్లో ఎప్పట్నుంచో చేస్తున్న పని మనిషి మాట్లాడుతు మోహన్ బాబు, మనోజ్ కి మధ్య స్టాఫ్ విషయంలో గొడవ జరిగింది.నా స్టాఫ్ ని నువ్వు ఏమనద్దని  
మనోజ్ ని మోహన్ బాబు నెట్టగానే మనోజ్ కూడా మోహన్ బాబు ని నెట్టాడు. విష్ణు, మనోజ్ మధ్య కూడా ఎప్పట్నుంచో గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా మౌనిక ని పెళ్లి చేసుకున్నాక పెద్దగా మాటలు లేవు.ప్రస్తుతం మనోజ్,మౌనిక ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోయారు.విష్ణు(vishnu)అన్నకి మోహన్ బాబు గారంటే ప్రాణం.ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోడు.అలాంటిది మనోజ్ నెట్టాడని తెలిస్తే అసలు  ఊరుకోడు .మనోజ్ కి పాప పుట్టినప్పుడు కూడా మోహన్ బాబు కుటుంబం లక్ష రూపాయిలు ఇచ్చిందని చెప్పింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com