Home

»

Latest News

270 సినిమాల్లో 180 ఫ్లాపులు:చివరికి 350 కోట్ల బ్లాక్‌బస్టర్‌తో అదరగొట్టిన మీ లెజెండరీ హీరో

Sep 2, 2026 3:50PM


ఆ హీరో ఫ్యాన్స్ మీరున్న సిటీలో మీ కళ్ళ ముందు ఉండే ఉంటారు.. అచ్చు ఆ హీరోలాగానే హెయిర్ స్టైల్, డ్రెస్, ఫేస్ కట్స్ తో 24 అవర్స్ ఆన్ మై హీరో యాటిట్యూడ్ అనేలా ఉండటం కూడా ఆ హీరో ఫ్యాన్స్ నైజం.  కానీ ఆ హీరో సుమారు 270  చిత్రాల్లో చేస్తే  180కి పైగా ప్లాప్స్.   పైగా  ముప్పై ఏళ్ల పాటు సరైన సోలో హిట్ లేదు. నిజం సైతం నిజామా అని ఆశ్చర్యపోయినా కూడా ఇది నిజమే.  కానీ తన క్రేజ్‌, స్టార్‌డమ్‌ ఏమాత్రం చెక్కు చెదరలేదు.

ఆయనే భారతీయ సినీ యవనికపై 'డిస్కో డాన్సర్'గా ముద్ర వేసుకున్న హీరో  మిథున్ చక్రవర్తి. . 1976లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన 'మృగయ' అనే క్లాసిక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మిథున్, తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. అప్పట్లోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ కాలపు అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అక్కడ నుంచి మిథున్ ఇండియాలోనే మోస్ట్ డిమాండింగ్ స్టార్లలో ఒకరిగా మారారు.


also read: నా గుర్తింపు, ఉనికి ఆయనే: ఎన్టీఆర్ భావోద్వేగ ట్వీట్ వైరల్ 

అయితే కాలం మారే కొద్దీ కథల ఎంపికలో వేగం, క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 90ల కాలంలో ఏడాదికి పదుల సంఖ్యలో, తక్కువ బడ్జెట్ మరియు వేగంగా పూర్తయ్యే సినిమాల్లో నటిస్తూ రికార్డులు క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయన ఖాతాలో ఓటములు ఎక్కువగా చేరుతూ వచ్చాయి. 1993 నుంచి 1998 మధ్యకాలంలోనే ఆయన నటించిన 33 చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అలా తన మొత్తం కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో నటించగా, ఏకంగా 180కి పైగా సినిమాలు తీవ్రమైన డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దాదాపు 30 ఏళ్ల పాటు బాక్సాఫీస్ వద్ద ఆయనకు ఒక భారీ సోలో హిట్ అనేది దక్కలేదనడం  నిజం. సాధారణంగా ఇన్ని డిజాస్టర్లు వస్తే ఏ నటుడి కెరీర్ అయినా అక్కడితో ముగిసిపోతుంది. కానీ మిథున్ చక్రవర్తి విషయంలో ఆ సూత్రం తన ప్రతాపాన్ని చూపించలేకపోయింది. 72 ఏళ్ల వయసులో ఇక ఆయన సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చినట్లే అనుకుంటున్న సమయంలో, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రంలో కీ రోల్ పోషించి  అద్భుతమైన నటనను కనబరిచారు. ఎటువంటి ముందస్తు అంచనాలు లేకుండా 2022లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తూ సుమారు 350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

తన సినీ జీవిత ప్రయాణంలో 3 జాతీయ అవార్డులు, ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్న మిథున్ చక్రవర్తి ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణం ఒక    అధ్యాయమనే చెప్పాలి

 

[ Mithun Chakraborty, 180 Flops, 350 Crore Blockbuster, The Kashmir Files, Telugu Cinema, Telugu Cinema News, Tollywood ]

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com