Home

»

Latest News

జపాన్‌లో 'మిరాయ్' సంచలనం: 'బాహుబలి 2' రికార్డ్ బ్రేక్.! 

Aug 20, 2026 11:30AM

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన విజువల్ వండర్ 'మిరాయ్' అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. జపాన్‌లో డే-1 అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'బాహుబలి 2' రికార్డులను బ్రేక్ చేస్తూ టాప్-7 స్థానంలో నిలిచింది.

'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకొని రికార్డులు క్రియేట్ చేసిన తేజ సజ్జా, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడు. జపాన్‌లో డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ లో అత్యధిక టికెట్లు అమ్ముడైన టాప్ 10 భారతీయ సినిమాల లిస్ట్‌లో 'మిరాయ్' ఏకంగా 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది. విచిత్రం ఏంటంటే.. 'బాహుబలి 2', 'టైగర్ జిందా హై', 'ధురంధర్ 2' వంటి భారీ చిత్రాల డే-1 బుకింగ్ రికార్డులను మిరాయ్ అధిగమించేసింది.

RRR, ముత్తు, పుష్ప 2, దేవర, సలార్ వంటి బిగ్ స్టార్స్ ప్రాజెక్ట్స్ తర్వాత.. ఒక యంగ్ హీరో నటించిన సినిమా ఈ స్థాయిలో జపాన్ లో ట్రెండ్ అవ్వడం చూసి ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఇంకా రిలీజ్‌కు ముందే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉందంటే.. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇక బాక్సాఫీస్ నంబర్స్ విషయానికి వస్తే.. 'మిరాయ్' ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు జపాన్ కలెక్షన్స్ తో ఆ నెంబర్ పెరగనుంది.

అసలు జపాన్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యిందో తెలుసా? కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కాన్సెప్ట్ అలాంటిది. చక్రవర్తి అశోకుడు, అలాగే కళింగ యుద్ధం తర్వాత దాచిన తొమ్మిది పవిత్ర గ్రంథాల వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంతో ఈ కథ నడుస్తుంది. ఆ పవిత్ర గ్రంథాలను కాపాడే 'సూపర్ యోధ'గా తేజ సజ్జా నటిస్తే.. ఆ గ్రంథాల ద్వారా అమరత్వాన్ని పొందాలని చూసే 'బ్లాక్ స్వోర్డ్' రోల్‌లో మంచు మనోజ్ విలన్‌గా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ హై-వోల్టేజ్ విజువల్ స్పెక్టాకిల్, పవర్ పుల్ మైథలాజికల్ యాక్షన్ కాన్సెప్ట్ జపనీస్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంటోంది.

 

 

 

 

Mirai Japan Release, Mirai Movie, Teja Sajja, Manchu Manoj

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com