Home

»

Latest News

అఖిల్ సినిమాలో గ్రాఫిక్స్ మాయాజాలం

Dec 18, 2014

 

సిసింద్రీ అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. మ‌నంలో అఖిల్ స్ర్కీన్ ప్రెజెన్స్ అభిమానుల‌కు న‌చ్చేసింది. అఖిల్‌ని వెండి తెర‌పై చూసి సంబ‌ర‌ప‌డిపోయారు. అప్ప‌టి నుంచీ పూర్తిస్థాయి చిత్రంలో ఎప్పుడు చూస్తామా అని గంపెడాశ‌ల‌తో ఎదురుచూస్తూ వ‌చ్చారు. మొత్తానికి ఈ సినిమాకి క్లాప్ కొట్టేశారు. అనుకొన్న‌ట్టుగానే వినాయ‌క్‌కి ఆ బాధ్య‌త అప్ప‌టించారు. మ‌రో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా మామూలు క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాదు. ఆరు పాట‌లూ, నాలుగు ఫైట్ల‌తో సాగిపోయే క‌థ కాదు. ఇదో సోషియో ఫాంట‌సీ. మాయ‌లూ, మంత్రాలూ ఉండ‌బోతున్నాయి. ఈ రోజుల్లో మాయ‌లూ, మంత్రాలంటే గ్రాఫిక్స్ పై ఆధార‌ప‌డాల్సిందే. దానికితోడు ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. హాలీవుడ్ స్థాయి నిపుణులూ మ‌న‌కు అందుబాటులో ఉన్నారు. కావ‌ల్సివ‌స్తే, ఏకంగా హాలీవుడ్ నిపుణ‌ల‌తో ప‌నిచేయించుకొనే స్థోమ‌త ఉంది. అందుకే అఖిల్ సినిమాలో గ్రాఫిక్స్ మాయాజాలానికి పెద్ద‌పీట వేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌. ప్రీ క్లైమాక్స్‌లో వ‌చ్చే గ్రాఫిక్స్ అంద‌రినీ అబ్బుర‌ప‌రుస్తాయ‌ట‌. అఖిల్ హీరోయిజానికి ఎంత ప్రాధాన్యం ఉందో, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ అంతే ప్రాధాన్యం ఉంద‌ని తెలుస్తోంది. మొత్తానికి సిసింద్రీ ఎంట్రీ ఫ్యాన్స్‌కి విజువ‌ల్ ట్రీటే అన్న‌మాట‌.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com