Home

»

Latest News

Michael jackson: మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. 7000 కోట్లు 

Jun 3, 2026 10:46AM

 

ప్రపంచ పాప్ పితామహుడు, కోట్లాది మంది అభిమానులు చేత కాలకృత్యాలు మాన్పించి తన పాటలని, డాన్స్ లని మాత్రమే చూసేలా చేసిన 'కింగ్ ఆఫ్ పాప్' మైఖేల్ జాక్సన్(Michael jackson). ఆ లెజండ్రీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మూవీ 'మైఖేల్'(Michael). ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై వరల్డ్  బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని  సృష్టించింది. ప్రారంభంలో మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ  ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. దాంతో ఈ మ్యూజికల్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 850 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు  7,100 కోట్లు) భారీ వసూళ్లని  సాధించి, గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మన దగ్గర  కూడా అదే రోజు ఇంగ్లీష్ వెర్షన్‌లోనే రిలీజై 50 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలని  ఆశ్చర్యపరిచింది.

థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ గ్లోబల్ వండర్, ఇప్పుడు భారతీయ డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. రాబోయే వారం నుంచే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. జూన్ 9,  నుండి ప్రముఖ ప్లాట్‌ఫారమ్ 'బుక్ మై షో స్ట్రీమ్' (BookMyShow Stream) లో డిజిటల్ ప్రీమియర్ కాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంగ్లీష్‌తో పాటు హిందీ లాంగ్వేజ్ లో  కూడా అందుబాటులో  ఉండనుంది. మొదటగా రెంటల్,కొనుగోలు విధానంలో అందుబాటులోకి రానుంది. అదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ వంటి ఇతర ప్రముఖ అంతర్జాతీయ వేదికల్లో కూడా రెంటల్ ప్రాతిపదికన విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ బయోపిక్‌లో  ప్రధాన ఆకర్షణగా నిలిచిన అంశం ఏమిటంటే, మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం. మైఖేల్ జాక్సన్ యొక్క ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, స్టేజ్ ప్రెజెన్స్, ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఐకానిక్ డ్యాన్స్ స్టెప్స్ ,సిగ్నేచర్ మూమెంట్స్‌ని  జాఫర్ అద్భుతంగా పండించి ప్రేక్షకులని  ఆశ్చర్యపరిచారు. తెరపై ఆయనను చూసిన ఫ్యాన్స్, చాలా సందర్భాల్లో నిజంగానే మైఖేల్ జాక్సన్‌ని  మళ్లీ చూస్తున్నామనే ఎమోషనల్ ఫీలింగ్‌ పొందారు. 1960ల కాలంలో 'జాక్సన్ 5' బ్యాండ్‌తో మొదలైన మైఖేల్ ప్రస్థానం నుంచి, 1980ల చివర్లో 'బ్యాడ్ వరల్డ్ టూర్' ద్వారా సాధించిన గ్లోబల్ సక్సెస్ వరకు జరిగిన ప్రయాణాన్ని అద్భుతంగా చూపించారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించగా నియా లాంగ్, జూలియానో వాల్డి, కోల్మన్ డొమింగో, మైల్స్ టెల్లర్ వంటి నటీనటులు కీ రోల్స్   పోషించారు. థియేటర్లలో ఈ విజువల్ వండర్‌ని  మిస్ అయిన ఇండియన్ ఆడియన్స్‌ ఓ టిటిలో చూసి మైకేల్ జాక్సన్ ఇచ్చే మజాని పొందవచ్చు. 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com