Home

»

Latest News

మెగా షో... అట్ట‌ర్ ఫ్లాప్‌

Aug 23, 2016 11:30AM

మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టిన రోజు వేడుక‌లు హైద‌రాబాద్ శిల్పక‌ళావేదికలో జ‌రిగాయి. ఈ  పోగ్రాం ఏదో ఇర‌గ‌దీస్తుంద‌నుకొంటే ఆద్యంతం చ‌ప్ప‌గా సాగింది. ఆడియో రీలీజ్ ఫంక్ష‌న్‌లా.... పాట‌లు, డాన్సుల‌తో హోరెత్తించేశారంతా. మెగా హీరోల్లో అంద‌రూ క‌ద‌లి వ‌చ్చినా ప‌వ‌న్ క‌ల్యాణ్ రాక‌పోవ‌డం, అస‌లు బ‌ర్త్‌డే బోయ్ చిరంజీవి మిస్ అవ్వ‌డం నిరాశ ప‌రిచింది. రామ్ చ‌ర‌ణ్ నుంచి శిరీష్ వ‌ర‌కూ ఎవ‌రు మైకు ప‌ట్టుకొన్నా ఇష్టం లేని పెళ్లికి వ‌చ్చిన‌ట్టు ముక్త‌స‌రిగా మాట్లాడేసి వెళ్లిపోయారు. చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన కొత్త విష‌యాలేమైనా తెలిశాయా, అంటే అదీ లేదు. టీజ‌ర్‌ని ఉద‌య‌మే ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసేయ‌డంతో చిరు పుట్టిన రోజు వేడుక‌లో కొత్త‌గా చూపించేందుకు ఏం లేకుండా పోయాయి. చిరు కోసం త‌యారు చేసిన ఏవీ అయితే.. ఇంకా దారుణంగా ఉంది. అల్లు శిరీష్ పొగడ్త‌ల ప‌ర్వం... కాస్త ఓవ‌ర్ అనిపించింది.  ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ క‌లిస్తే చిరంజీవి అని చెప్ప‌డం.. పెద్ద జోక్‌గా మారింది. పోగ్రాం మొద‌లైన కాసేప‌టికే అభిమానుల‌కు సైతం నీర‌సం వ‌చ్చేసిందంటే, కొన్ని సీట్లు చివ‌రి వ‌ర‌కూ ఖాళీగా కనిపించాయంటే ఈ మెగా షో ఎంత బాగా జ‌రిగిందో ఊహించుకోవొచ్చు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com