Home

»

Latest News

పెద్దకూతురిని ప్రేమతో తలపై కొట్టిన చిరు..!

Mar 29, 2016 2:39PM

కూతురి పెళ్లిని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. కుటుంబమంతా ఒక చోటికి చేరి జరుపుకుంటున్న ఈ వేడుక మెగారేంజ్ కు తగ్గట్టుగానే జరుగుతోంది. సంగీత్ లో డ్యాన్స్ వేయడం మెయిన్ పార్ట్. మరి తెలుగు ప్రజలంతా డ్యాన్స్ లో టాప్ గా భావించే మెగాస్టార్ ఆ ఫంక్షన్లో ఉన్నప్పుడు స్టెప్పు వేయకపోతే ఎలా కుదురుతుంది..? అందుకే చిరు పెద్ద కూతురు సుస్మిత ఆయన్ను లాక్కుని వచ్చి స్టెప్స్ వేయించింది.

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పాటకు చిరు వేసిన స్టెప్స్ కు అందరూ విజిల్స్ కొట్టారు. డ్యాన్స్ లో అదే గ్రేస్ తో, అదే ఈజ్ తో ఇరగదీశారు. మధ్యలో స్టెప్స్ తప్పిందని, కూతుర్ని ప్రేమగా కొట్టారు మెగాస్టార్. ఆయన డ్యాన్స్ చూసిన వారందరూ, డ్యాన్స్ లో ఇప్పటికీ చిరంజీవే నెంబర్ వన్ అంటూ కితాబిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com