రామ్చరణ్-ఉపాసనకు కవలలు.. ఈ ఆనందానికి అవధుల్లేవు: చిరంజీవి
on Feb 1, 2026

రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కొణిదెల (Upasana Konidela) దంపతులకు కవలలు - ఒక బాబు, ఒక పాప జన్మించడంతో మెగా కుటుంబంలో అపూర్వమైన ఆనందం నెలకొంది. ఈ ప్రసవం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో జరిగింది. ఈ శుభవార్త మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కుటుంబంలో రెట్టింపు వేడుకలని తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. "మా శ్రేయోభిలాషులు, మా అభిమానులు, మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరికి మా ఇంట జరిగిన ఈ శుభవార్త పంచుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటు కొణిదెల ఫ్యామిలీ అటు కామినేని ఫ్యామిలీ రెండు కుటుంబాలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము. రామ్ చరణ్, ఉపాసన రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసన, బిడ్డలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాము.
మా ఇంట ఈ మంచి జరగాలని మీరు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. భగవంతుడి దయవల్ల, హనుమాన్ కృప వలన ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఇది మా అందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం. మమ్మల్ని అభిమానించే వారికి, మా మంచి కోరుకునే వారికి ఈ వార్తని పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది.
ఇంత సుఖ ప్రసవం జరిగినందుకు అపోలో వైద్యులకు, వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అభిమానులు అందరూ కూడా ఇది మరింత పండుగలాగా జరుపుకుంటూ వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా ఉంది. మా ఆనందానికి కూడా అవధులు లేవు." అన్నారు.
జూన్ 20, 2023న రామ్ చరణ్–ఉపాసన దంపతులు తమ తొలి సంతానంగా కుమార్తె క్లింకారకు జన్మనిచ్చారు. ఇప్పుడు, కవలల రాకతో మెగా ఆనందం రెట్టింపు అయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



