Home

»

Latest News

సింపుల్‌గా విడుదలైన రామ్‌చ‌ర‌ణ్ `ధృవ` పాట‌లు

Nov 9, 2016 4:20PM

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన  గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్ట‌యిలిష్ ఎంట‌ర్‌టైన‌ర్ `ధృవ`. అల్లు అర‌వింద్‌, మ‌రో నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్  సంయుక్తంగా ఈ చిత్రాన్ని హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.

హిప్ హాప్ ఆది సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు నేరుగా మార్కెట్లోకి విడుద‌లయ్యాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లై ట్రెండీ మ్యూజిక్‌తో ఉన్న ధృవ పాట‌ల‌కు ఆడియెన్స్  నుండి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తున్నాయి. ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాపై ప్రేక్ష‌కులు, అభిమానుల్లో భారీ క్రేజ్ నెల‌కొంది.  అన్నీ కార్య‌క్ర‌మాలను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com