Home

»

Latest News

ధృవకి క‌టింగులు ఇస్తున్న‌... చిరు

Nov 24, 2016 2:25PM

రామ్ చ‌ర‌ణ్ ఆశ‌ల‌న్నీ ఇప్పుడు ధృవ సినిమానే ఉన్నాయి. ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాల్సిందే. లేదంటే.. ఆ ప్ర‌భావం చ‌ర‌ణ్ కెరీర్‌పై, తాను తీసుకొనే నిర్ణ‌యాల‌పై విప‌రీతంగా ప‌డే అవ‌కాశం ఉంది. అందుకే ధృవ విష‌యంలో చాలా చాలా జాగ్ర‌త్త‌ప‌డిపోతున్నాడు చ‌ర‌ణ్‌. ఏ విష‌యంలోనూ అల‌స‌త్వం చూపించ‌డం లేదు. పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంతో వ‌సూళ్ల‌కు ముప్పు లేద‌ని తెలిసినా, ఎందుకైనా మంచిద‌ని ఓ వారం ఆగి వ‌స్తున్నాడు. ఏకంగా 20 రోజుల ముందే ఫ‌స్ట్ కాపీ ని రెడీ చేసుకోగ‌లిగాడు.

ఇప్పుడు తీరిగ్గా ఈసినిమాలో మార్పులు, చేర్పులు చేయ‌డానికి రంగం సిద్దం చేసుకొన్నాడు. ధృవ ర‌న్ టైమ్ రెండున్న‌ర గంట‌ల‌కు పైగానే వ‌చ్చింద‌ట‌. అందులో క‌నీసం ప‌ది నిమిషాలు ట్రిమ్ చేయాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌కి చెందిన క‌థ ఇది. రెండున్నర గంట‌లుంటే బోర్ కొడుతుంది. అందుకే... ఎలాగైనా ప‌ది నిమిషాలు ట్రిమ్ చేయాల్సిందే. త్వ‌ర‌లోనే ఈ సినిమాని చిరంజీవికి చూపించ‌నున్నార‌ని, చిరు స‌ల‌హాలు తీసుకొని ఈ సినిమాకి మ‌ళ్లీ క‌త్తెర్లు వేస్తార‌ని తెలుస్తోంది. అంటే. ధృవ‌కి క‌త్తెర్లు వేసే బాధ్య‌త చిరుకే అప్ప‌గించార‌న్న‌మాట‌. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com