Home

»

Latest News

చిరుని కాదన్నాడు..అజిత్‌కి సై అన్నాడు

Oct 21, 2016 12:58PM

బాలీవుడ్‌ నటీనటులు మిగిలిన ఇండస్ట్రీల వారితో పోలిస్తే విభిన్నం. పాత్రలో కొత్తదనం కోరుకునే వీరు..కథ నచ్చితే ఎంత దూరానికైనా వెళ్తారు. అందుకు సూపర్‌స్టార్లైనా సరే విలన్లుగా నటించి ఆకట్టుకుంటారు. అమితాబ్, షారూఖ్, అమీర్ ఖాన్‌ విలన్లుగా రాణించారు..వారి బాటలోనే క్రిష్-3లో ప్రతినాయకుడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ప్రముఖ హీరో వివేక్ ఒబెరాయ్. దీంతో వివేక్‌కు విలన్ పాత్రలు క్యూకట్టాయి. ఒక్క బాలీవుడ్‌లోనే కాదు. టాలీవుడ్, కోలీవుడ్‌ల నుంచి కూడా ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. దీనిలో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నెం 150 కూడా ఉంది. కానీ ఎందుకో వివేక్ ఈ బంపర్‌ ఆఫర్‌ని రిజెక్ట్ చేశాడట.

అలా మెగాస్టార్ మూవీ నుంచి తప్పుకున్న ఒబెరాయ్ అజిత్‌కు మాత్రం సై అన్నాడు. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "తలా-57" సినిమాలో ప్రతినాయకుడిగా నటించేందుకు వివేక్ ఒబెరాయ్ గ్రీన్ సిగ్నల్ అందించాడట.  జేమ్స్‌బాండ్ తరహా సినిమా కావడంతో పాటు విలన్ పాత్ర స్టైలిష్‌గా ఉండబోతోందని..అంతేకాకుండా ఇప్పటికే శివ-అజిత్ కాంభినేషన్‌లో వరుస సూపర్‌హిట్స్ రావడంతో వివేక్ వెనుక ముందు ఆలోచించకుండా ఆఫర్‌ను ఓకే చేశాడని కోలీవుడ్ టాక్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com