Home

»

Latest News

రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిన మెగా హీరో!

Jul 5, 2016 8:45AM


మెగా మేనల్లుడు ఇప్పటివరకూ అన్నీ కమర్షియల్ సినిమాలే చేస్తూ వచ్చాడు. ముందు హీరోగా ఐడెంటిటీ సంపాదించుకోవడం ముఖ్యం అనుకొన్న సాయిధరమ్ డిఫరెంట్ సినిమాల జోలికి పోకుండా మాస్ నే నమ్ముకొన్నాడు. అందుకే క్యారెక్టర్లు వేరైనా.. క్యారెక్టరైజేషన్ మాత్రం ఒకేలా ఉంటుంది. తాజా చిత్రం "తిక్క"లోనూ అదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నాడట సాయిధరమ్ తేజ్. సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి ఓ రియల్ ఎస్టేట్ డీలర్ గా కనిపించనున్నాడు. 
సినిమా మొత్తం బ్యాంకాక్ లోనే జరుగుతుంది. అందుకు తగ్గట్టే హీరోయిన్లను కూడా అక్కడివారినే సెలక్ట్ చేసుకొన్నాడు. టిపికల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ కూడా ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నట్లు సమాచారం. ఆగస్ట్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com