Home

»

Latest News

మెగా 158లో మరో స్టార్ హీరో.. ఎలాంటి క్యారెక్టర్ అంటే..?

Feb 02, 2026

2023లో మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్‌హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో చిరంజీవి చేసిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి మెగాస్టార్ ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది. ఈ ఏడాది ‘విశ్వంభర’ వంటి భారీ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగాస్టార్.

 

ఇదిలా ఉంటే.. తన 158వ సినిమాను బాబీ కాంబినేషన్‌లో చేస్తున్నారు చిరంజీవి. హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాలో మెగాస్టార్‌కి తోడు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కూడా జత కలవబోతున్నారు. ఇందులోని ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఆయన పోషించనున్నారు. క్యారెక్టర్ బాగా నచ్చడంతో సినిమా చేసేందుకు మోహన్‌లాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

 

ఇటీవలి కాలంలో కొన్ని సినిమాల్లో స్టార్ హీరోలు కేమియోలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మోహన్‌లాల్ చేసే క్యారెక్టర్ అలాంటిది కాదని, కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆయన నటించనున్నారని తెలుస్తోంది. చిరంజీవి, మోహన్‌లాల్ వంటి స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే దానికి వచ్చే రెస్పాన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రాజెక్ట్‌లో మోహన్‌లాల్‌ని కూడా ఇన్‌వాల్వ్ చెయ్యడం  ద్వారా సినిమాకి భారీ హైప్ వచ్చే అవకాశం ఉంది. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చెయ్యాల్సి ఉంది. 

 

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో ఉండడం అనేది వాల్తేరు వీరయ్యతో ప్రారంభమైంది. ఆ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించారు. అది సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్‌హిట్ అయ్యింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన మన శంకరవరప్రసాద్‌గారు చిత్రంలో విక్టరీ వెంకటేష్ నటించారు. ఇది కూడా బ్లాక్‌బస్టర్ అయింది. ఇప్ప్పుడు మెగాస్టార్, బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో మోహన్‌లాల్ చేయబోతున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ విధంగా మెగాస్టార్ సంక్రాంతి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com