Home

»

Latest News

Mayookha Movie Review: మయూఖ మూవీ రివ్యూ 

Oct 9, 2026 3:55PM

 

-సినిమా పేరు: మయూఖ
-న‌టీన‌టులు: పాయల్ చెంగప్ప, అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిశ్మ -దబ్బార, జాను వర్మ, నానాజీ కర్రి, రఘు వాసిరెడ్డి తదితరులు 
-సినిమాటోగ్ర‌ఫీ: ఫర్హాన్ వడక్కం
-ఎడిటింగ్: శరత్. జె
-మ్యూజిక్: శిబి మాత్యూ అలెక్స్
-నిర్మాత‌: శశిధర్ నల్ల
-బ్యానర్స్:ఫ్రష్విత ఎంటర్ టైన్ మెంట్స్, సినిమా బండి ప్రొడక్షన్స్     
-రచన,దర్శకత్వం: శ్రీ తేజ్ ఎస్ కే

-రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 9 ,2026 

ప్రచార చిత్రాలతో క్రేజ్ ఏర్పరచుకున్న చిత్రం 'మయూఖ'. క్రైమ్, సస్పెన్స్  థ్రిల్లర్ గా తెరకెక్కింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ

మయూఖ(పాయల్ చెంగప్ప).పెళ్లి కానీ అందమైన యువతి. బ్యాంక్ లో పని చేస్తుంటుంది. ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం తన డ్యూటీ. తన ఊహల్లో పదేళ్ల వయసులో జరిగిన  భయంకర సంఘటన గుర్తుకొస్తుండటంతో భయం బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. నైట్ అయితే బెడ్ పై  తన పక్కనే రాత్రిపూట ఒక అపరిచిత వ్యక్తి నిద్రపోతుంటాడు. మయూఖని ఏం చేయకుండా ఉదయాన్నే వెళ్లిపోతుంటాడు. ఇంకో పక్క ఆడవాళ్ళని చంపి ఆడవాళ్ళ చేతుల ద్వారా సెంట్ ని తయారు చేసే సైకో తన లక్ష్యంలో బిజీగా ఉంటాడు. మయూఖకి సైకో కి మధ్య జరిగిన కథే మయూఖ.

ఎనాలసిస్ 

కథ పాయింట్ బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సూపర్. స్టార్టింగ్ సీన్ తో  మూవీ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ కలిగింది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే మయూఖ విషయంలో ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ ఇస్తూ ఇచ్చిన సీన్స్ బాగున్నాయి. వాచ్ మెన్ క్యారక్టర్ ని మరింతగా ఉపయోగించుకోవాల్సింది. సైకో వ్యక్తి తన లక్ష్యం కోసం చేసే సన్నివేశాలని భయం కలిగించేలా చేసే సీన్స్ ని ఎందుకు ఎక్కువగా సృష్టించలేకపోయారో అర్ధం కాదు. ఎందుకంటే కథ మెయిన్ పాయింట్ అదే.  ఎంత సేపు ఇన్విస్టిగేషన్, మయూఖ భయపడటం సీన్స్ పైనే వెళ్లారు. ఇంటర్వెల్ ట్విస్ట్ నార్మల్. సెకండ్ హాఫ్ లో కథనంలో వేగం పెరిగింది. సైకోకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ , సీన్స్ అతని గోల్ చూస్తే ఒళ్ళు గగుర్ పాటుకి గురవుతుంది. ఆ క్యారక్టర్ గోల్ పై  కొన్ని లాజిక్ లు ఉన్నా  సినీ ఫక్కీలో కొట్టుకుపోతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి.  

నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు 

మయూఖగా చేసిన పాయల్ చెంగప్ప తన పెర్ఫార్మ్ తో  మెస్మరైజ్ చేసింది. కాకపోతే ఎక్కువగా లాంగ్ షాట్స్ పడటం వల్ల ఫేస్ లోని ఎక్స్ ప్రెషన్స్  అంతగా కనిపించలేదు. పోలీస్ ఇన్స్పెక్టర్ గా చేసిన దేవ్ శశాంక్ తన పెర్ఫార్మ్ తో ఆకట్టుకున్నాడు.సైకో గా చేసిన ఆర్టిస్ట్ తో పాటు మిగతా అందరు తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు మెప్పించారు. శ్రీ తేజ్ దర్శకుడిగా భారీగా సక్సెస్ అయినా రచయితగా మాత్రం అంతగా మెప్పించలేకపోయాడు.   నిర్మాణ విలువలు, ఫొటోగ్రఫీ ప్రధాన హైలెట్.. మయూఖ లాంటి సబ్జెక్ట్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయువుపట్టులా ఉండాలి. అలాంటిది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో పెద్దగా మెరుపులు లేవు.

బలాలు
1 .కథ  
2 . దర్శకత్వం 

బలహీనతలు 
1 .కథనం ఎస్టాబ్లిష్ చేసే విధానంలో కొన్ని లోపాలు 

చివరిగా చెప్పుకోవాలంటే క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి చూసేయచ్చు
 

  

రేటింగ్ 2 .5 /5                                                                                                                                                                                                                                                అరుణాచలం 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com