
'శంకరాభరణం' తో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించిన నటి మంజు భార్గవి. ఎంతలా అంటే తన మిగతా చిత్రాల గురించి చెప్పుకున్నా వైబ్రేషన్ అంటూ కనపడదు. శంకరా భరణంతో తన జీవితం ధన్యమైనట్టు కూడా. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాజీ హీరోయిన్ 'ఛార్మి' పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతు 'పౌర్ణమి చిత్రంలో తాను పోషించిన నెగటివ్ రోల్ ని ఎంతగానో ఆస్వాదించానని, సాధారణంగా తాను చేసే క్యారక్టర్ లకి అది పూర్తి విరుద్ధమని తెలిపారు. ఆ రోల్ చెయ్యాలని తనకు అనిపించిందని, అందులో తనలోని గయ్యాళి బయటకు వచ్చిందని సరదాగా అన్నారు. పౌర్ణమిలో హీరోయిన్ చార్మీ డాన్స్ కోసం ఎంతగా కష్టపడిందో ఆమె గుర్తు చేసుకున్నారు, కూచిపూడి మాస్టర్ ధర్మరాజ్ వద్ద చార్మీ రోజూ సాయంత్రం ప్రాక్టీస్ చేసేదని చెప్పారు.
తనకు నటిగా కంటే డాన్సర్గానే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని మంజు భార్గవి అన్నారు. చిన్ననాటి నుంచే డాన్స్ పట్ల తనకున్న మక్కువను, తన తల్లి ప్రోత్సాహంతోనే ఈ రంగంలోకి వచ్చానని చెప్పారు. అవార్డుల పట్ల తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, తనకు సంగీత నాటక అకాడమీ అవార్డు లభించిందని, అయితే సినిమాల విషయంలో అవార్డులను తాను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:మహేష్ బాబుతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా: ఇప్పుడు టాప్ హీరోయిన్!
ప్రేక్షకులను సంతోషపెట్టడమే అతిపెద్ద అవార్డు అని ఆమె గట్టిగా నమ్ముతారు. భౌతికంగా లభించే అవార్డులు బూజు పట్టిపోతాయని, వాటిని దులిపేందుకు సమయం కేటాయించాల్సి వస్తుందని, కానీ ప్రేక్షకుల ప్రేమ హృదయాల నుంచి వస్తుందని, అది ఎప్పటికీ శాశ్వతమని ఆమె అన్నారు.

తన కెరీర్లో శంకరాభరణం సినిమా తనకు అత్యంత ఇష్టమైనదని, ఆ చిత్రం ద్వారా ఒక గురువు చెప్పిన కొంచెం అనే పదాన్ని అర్థం చేసుకోగలిగానని తెలిపారు. ప్రభాస్, ప్రభుదేవా కాంబోలో వచ్చిన పౌర్ణమిలో ఛార్మి వన్ ఆఫ్ ది హీరోయిన్ అనే విషయం తెలిసిందే.
మీకు నచ్చవచ్చు:గిరిబాబు మరణంపై చిరంజీవి భావోద్వేగం!
మీకు నచ్చవచ్చు:ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబో కథ ఇదేనా!: ఫ్యాన్స్ లో పూనకాలు!
[Manju Bhargavi, Charmy Kaur, Pournami, Prabhas, Sankarabharanam]




.webp)
