Home

»

Latest News

'మండాడి' షాకింగ్ కలెక్షన్స్: 5 రోజుల్లో అన్ని కోట్లా.. నిర్మాత పనికి షాక్‌లో నెట్‌ఫ్లిక్స్.!

Sep 15, 2026 4:24PM

సూరి, సుహాస్ ప్రధాన పాత్రలు పోషించిన మూవీ 'మండాడి'. పడవ పందేల నేపథ్యంలో ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకుడు. సెప్టెంబర్ 10న విడుదలైన 'మండాడి' చిత్రం, పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.65 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. 

కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సూరి హీరోగా అద్భుతమైన అభినయం ప్రదర్శించగా, సుహాస్ విలనిజంతో కూడిన కీలక పాత్రలో మెప్పించారు. సముద్రం నేపథ్యంలో వచ్చే బోట్ రేసింగ్ సీన్స్, విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అందుకే బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయాలని ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండటంతో భారీ వసూళ్లు వస్తున్నాయి. ఫుల్ రన్ లో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే, ఓటీటీ డీల్ విషయంలో నిర్మాత ఎల్రెడ్ కుమార్ తీసుకున్న డేరింగ్ స్టెప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'మండాడి' ఓటీటీ డీల్ చర్చలు నెట్‌ఫ్లిక్స్ తో జరిగాయి. నిర్మాత రూ.25 కోట్లు ఆశించగా, నెట్‌ఫ్లిక్స్ రూ.15 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య ఒక డీల్ కుదిరింది. బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ రూ.50 కోట్ల గ్రాస్ మార్క్ దాటితే, రూ.30 కోట్లు.. రూ.60 కోట్ల నుండి రూ.80 కోట్ల రేంజ్ లో కలెక్ట్ చేస్తే, రూ.40 కోట్లు చెల్లించేలా నెట్‌ఫ్లిక్స్ అంగీకరించింది. ఒకవేళ రూ.50 కోట్ల క్లబ్ లో చేరకపోతే.. రూ.10 కోట్ల బేస్ అమౌంట్‌ మాత్రమే చెల్లిస్తామని కండిషన్ పెట్టింది. 

ఇప్పుడు నిర్మాత నమ్మకం నిజమై, 'మండాడి' బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్స్ రాబడుతుండటంతో నెట్‌ఫ్లిక్స్ సైతం షాక్ అయిందట. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రైట్స్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ నుండి ఏకంగా రూ.40 కోట్లు ఖాతాలో వేసుకోబోతుంది.

 

 

 

[Mandaadi Box Office Collection, Mandaadi 5 Days Collections, Mandaadi Collections, Mandaadi OTT Deal, Mandaadi Netflix, Soori Mandaadi, Suhas Mandaadi, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com