Home

»

Latest News

మంచు విష్ణు 'కన్నప్ప కథ'

Mar 4, 2020 11:05AM

 

శివభక్తుడు కన్నప్ప కథతో మంచు విష్ణు ఒక సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేసున్నట్లు కొద్ది రోజుల క్రితం మోహన్ బాబు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం విష్ణు రూ. 60 కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు కూడా ఆయన తెలిపారు. తాజాగా ఈ సినిమా కోసం ఫిలించాంబర్‌లో 'కన్నప్ప కథ' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. విష్ణుకు చెందిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై కాకుండా మోహన్ బాబు సొంత నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించడం గమనార్హం. కన్నప్ప కథ' సినిమా మోహన్ బాబు సమర్పణలో విష్ణు నిర్మాణంలో జరిగే అవకాశాలున్నాయని మంచు ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. తనికెళ్ల భరణి రాసిన స్క్రిప్ట్ ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నది. 

చాలా కాలం నుంచీ ఈ సినిమా స్క్రీన్‌ప్లేను పకడ్బందీగా తయారుచేసే పనిలో విష్ణు నిమగ్నమై ఉన్నాడు. శివునిపై ఆరాధనతో తన కళ్లను పెకలించుకోవడానికి కూడా వెనుకాడని పరమ శివభక్తునిగా కన్నప్ప గురించి కథలు ప్రచారంలో ఉన్నాయి. కాగా ఈ ప్రాజెక్టు విషయంలో విష్ణు నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. కన్నప్పగా ఎవరు నటిస్తారు, ఎవరు ఆ సినిమాని డైరెక్ట్ చేస్తారనే విషయం కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. అతి త్వరలోనే ఈ సస్పెన్స్‌కు తెరపడనున్నది. గతంలో బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు టైటిల్ రోల్ పోషించిన 'భక్త కన్నప్ప' (1976).. ఒక క్లాసిక్ మూవీగా టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయిన విషయం ప్రస్తావనార్హం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com