మంచు విష్ణును కలిసిన క్షణాల్లోనే పడిపోయా
on Apr 25, 2020
హీరో మంచు విష్ణు, వెరోనికా రెడ్డిది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు కుమార్తె వెరోనికా కావడం... విష్ణు ఏమో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పెద్ద కుమారుడు కావడంతో అప్పట్లో ఈ ఈ ప్రేమ వివాహం హాట్ టాపిక్ అయింది. పదకొండు ఏళ్ల క్రితం... 2009లో మార్చి 1న వీరి పెళ్లి జరిగింది. అయితే... ఈ రోజు విరోనిక రెడ్డి హ్యాపీ యానివర్సరీ విషెస్ చెప్పారు. అదేంటి అనుకుంటున్నారా? 14 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరూ ఇదే రోజున... అనగా ఏప్రిల్ 15న తొలిసారి కలిశారు. అందుకని వెరోనికా ఇప్పుడు విషెస్ చెప్పారు. ఇంతకీ, ఆమె విష్ణుతో ఎప్పుడూ ప్రేమలో పడ్డాను తెలుసా? తొలిచూపులోనే. విష్ణు చూసిన కొన్ని క్షణాల్లోనే తన జీవితకాలపు జోడి ఇతగాడే అని తెలుసుకున్నారట.
"నేను ఈ మనిషిని 14 ఏళ్ల క్రితం కలిశా. వెంటనే 'ఇతడే' (సరైన జీవిత భాగస్వామి) అని తెలుసుకున్నాను. నిజంగా ఒట్టేసి చెబుతున్నా... సెకండ్ల వ్యవధిలోనే తెలుసుకున్నాను. ప్రస్తుతం నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నీతో మరిన్ని మధుర జ్ఞాపకాల కోసం ఎదురు చూస్తున్నా. ఐ లవ్ యూ" అని వెరోనికా రెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో వాళ్లిద్దరూ దిగిన ఫొటో ఆమె పోస్ట్ చేశారు.