
మంచు మనోజ్.. నాకు తెలుగు సినిమా, నటనే ముఖ్యమంటూ హీరోగానే కాకుండా ప్రతి నాయకుడుగాను రాణిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 24 న బాలయ్యకి ప్రతినాయకుడిగా 'దాదా' తో రాబోతున్నాడు.
మంచు మనోజ్ సతీమణి భూమా మౌనిక రెడ్డి చేపట్టిన సరికొత్త వ్యాపార ప్రయాణం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. విశాఖపట్నంలో అత్యంత వైభవంగా జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) వేదికగా ఏపీ ప్రభుత్వంతో ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. భూమా మౌనిక ఫౌండర్ మరియు సీఈవోగా వ్యవహరిస్తున్న ‘నమస్తే వరల్డ్’ (Namasthe World) సంస్థ తరఫున ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వంతో అధికారికంగా ఎంఓయూ (MoU) సంతకాలు పూర్తయ్యాయి.
భారతీయ ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, హస్తకళలను నేటి ఆధునిక ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ స్టార్టప్ రూపుదిద్దుకుంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 36.24 కోట్ల భారీ ప్రతిపాదిత పెట్టుబడితో సరికొత్త ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కానుంది. కేవలం బొమ్మల తయారీ మాత్రమే కాకుండా, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్లతో కూడిన ప్లష్ టాయ్స్, స్థానిక హస్తకళలు, చేనేత వస్త్రాలు మరియు సుస్థిరమైన అపెరల్ ఉత్పత్తులను ఈ యూనిట్ ద్వారా తయారు చేయనున్నారు.
.webp)
ముఖ్యంగా ఏటికొప్పాక, కొండపల్లి వంటి అద్భుతమైన సంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ, స్థానిక చేనేత కార్మికులకు, మహిళలకు అండగా నిలవడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ఈ పర్యావరణ అనుకూల తయారీ వ్యవస్థ ద్వారా సుమారు 950 మందికి ప్రత్యక్షంగాను, మరో 100 మందికి పరోక్షంగానూ కలిపి మొత్తం 1,050 ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇది కూడా చదవండి: మీనాక్షి చౌదరి సంచలనం.. భోజనానికి కూర్చుంటే వాళ్ళు తినడానికి కీటకాలు వడ్డించారు!
ఈ చారిత్రాత్మక విజయంపై మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. గడచిన ఐదేళ్లుగా తన సతీమణి మౌనిక పడిన కష్టానికి, అంకితభావానికి దక్కిన తగిన ప్రతిఫలమిది అని కొనియాడారు. "మౌనికా.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. తిరుపతిలో మన తొలి ఎంఓయూ కుదిరిన కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఈ ఘనత సాధించాం" అంటూ మనోజ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సంస్థలో మంచు మనోజ్ కో-ఫౌండర్ మరియు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థ 55కి పైగా ఒరిజినల్ ప్లష్ టాయ్ డిజైన్లను అభివృద్ధి చేసిందని, సుమారు 43,000లకు పైగా బీఐఎస్ (BIS) సర్టిఫైడ్ బొమ్మలను విక్రయించిందని తెలిపారు. అంతేకాకుండా, ప్రఖ్యాత రిలయన్స్ బ్రాండ్స్‌తో రిటైల్ భాగస్వామ్యాన్ని కూడా కుదుర్చుకున్నట్లు వారు వెల్లడించారు. సాంప్రదాయ కళలకు ఆధునిక సాంకేతికతను జోడించి, 'మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్' గుర్తింపును ప్రపంచవ్యాప్తం చేయడమే తమ అంతిమ ధ్యేయమని ఈ దంపతులు స్పష్టం చేశారు.
మీకు నచ్చవచ్చు: ధురంధర్ 2 ని దెబ్బ కొట్టిన రామాయణ!
మీకు నచ్చవచ్చు: తనికెళ్ళ భరణి, బ్రహ్మానందంకి అహం అణిగిందా!
[Manchu Manoj,Mounika, Namasthe World startup, Balakrishna, Dada]






