రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిలాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది
on Jan 18, 2025
మంచు మోహన్ బాబు(Mohan Babu)ఆయన పెద్ద కుమారుడు విష్ణు(Vishnu)ఒక వైపు,రెండో కుమారుడు మనోజ్(Manoj)ఒక వైపుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.కాకపోతే కొన్ని రోజుల నుంచి సద్దుమణిగిన ఈ గొడవలు లేటెస్ట్ గా మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నతన తాత,నాయనమ్మల సమాధి దగ్గరకి వెళ్లడం,ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతు విష్ణుపై కొన్ని ఆరోపణలు చెయ్యడంతో మళ్ళీ గొడవ రాజుకుంది.ఆ తర్వాత వెంటనే విష్ణు తన 'ఎక్స్' ఖాతాలో తన తండ్రి మోహన్ బాబు నటించిన రౌడీ సినిమాలోని 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది.వీధిలో మొరగడానికి,అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మల్లో అయినా తెలుసుకుంటావనే ఆశ' అనే డైలాగ్ ని పోస్ట్ చెయ్యడం జరిగింది. చేసాడు.
ఇప్పుడు మనోజ్ తన 'ఎక్స్' వేదికగా రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించిన భక్త కన్నప్పతో పాటు కొన్ని సినిమాల్లోని పిక్స్ ని షేర్ చేసి 'కన్నప్ప'(kannappa)లో రెబల్ స్టార్ కృష్ణంరాజు(Krishnam Raju)గారి లాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది.ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావని రాసుకొచ్చాడు.అదే విధంగా తన తండ్రి నటించిన ఒక సినిమాలోని వీడియోని కూడా షేర్ చేసాడు.అందులో మోహన్ బాబు మాట్లాడుతు కాలు దువ్వాలనుకుంటే నీ తల తీసి నీ పెళ్ళాం ఒళ్ళో వేసేవాడ్ని.నా భార్య చెప్పింది కాబట్టి గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్చాను.నాకు రావాల్సిన ఆస్తిని ఇచ్చేయండనే డైలాగులు పలువురిని ఆలోచింపచేస్తున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
