మోహన్ బాబు బర్త్ డే.. కంటతడి పెట్టిస్తున్న మనోజ్ వీడియో!
on Mar 19, 2025
మంచు మోహన్ బాబు (Mohan Babu) తనయులు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విభేదాలకు కారణం ఆస్తి గొడవలే అని వార్తలొచ్చాయి. కారణం ఏంటో స్పష్టంగా తెలియదు కానీ, ఈ వివాదంలో మోహన్ బాబు తన పెద్ద కుమారుడు విష్ణు పక్కన నిలబడ్డారు. ఈ క్రమంలో ఈరోజు(మార్చి 19) మోహన్ బాబు పుట్టినరోజు ఉండగా, ఈ వేడుకలకు మనోజ్ కి కనీసం ఆహ్వానం కూడా లేదని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మనోజ్ తన తండ్రిపై ప్రేమను సోషల్ మీడియా వేదికగా చాటుకోవడం విశేషం. (Manchu Manoj)
తన తండ్రి మోహన్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మనోజ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. మీ పుట్టినరోజు వేడుకల్లో మీ పక్కన లేకపోవడం బాధగా ఉందని, మీతో ఉండటం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని రాసుకొచ్చాడు. అలాగే తండ్రి మోహన్ బాబుతో కలిసి తాను స్క్రీన్ షేర్ చేసుకున్న విజువల్స్ తో ఉన్న వీడియోని కూడా షేర్ చేశాడు. ఆ వీడియోకి యానిమల్ మూవీలోని నాన్న సాంగ్ ని జోడించడం విశేషం.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
