గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన 'మనసానమః'
on Jun 26, 2022
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న 'మనసానమః' షార్ట్ ఫిల్మ్ కి అరుదైన గౌరవం లభించింది. అత్యధిక అవార్డులు అందుకున్న షార్ట్ ఫిల్మ్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఇప్పటివరకు ఏ షార్ట్ ఫిల్మ్ సాధించని విధంగా 500 కు పైగా అవార్డులను సొంతం చేసుకుంది.
'మనసానమః' షార్ట్ ఫిల్మ్ కి దీపక్ దర్శకత్వం వహించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ లో హీరోగా విరాజ్ అశ్విన్, హీరోయిన్లుగా దృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీశర్మ నటించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్.. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై 513 అవార్డులను గెల్చుకుంది. దీంతో 'మనసానమః'ను అత్యధిక అవార్డులు అందుకున్న షార్ట్ ఫిల్మ్ గా ధృవీకరిస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రశంసాపత్రాన్ని అందించింది.
'చైత్రమాసం, వర్షాకాలం, శీతాకాలం' ఇలా మూడు కాలాల్లో ప్రేమలో సూర్య ఎదుర్కొనే పరిణామాలను ఈ షార్ట్ ఫిల్మ్ లో డైరెక్టర్ ఎంతో అందంగా చూపించాడు.
Also Read