Home

»

Latest News

మన శంకర వరప్రసాద్ గారు అసలు కథ.. చిరంజీవి క్యారక్టర్ ఇదే 

Aug 22, 2025 3:28PM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara varaprasad Garu).'పండక్కి వస్తున్నాం' అనేది టాగ్ లైన్. ఈ మేరకు హైదరాబాద్(Hyderabad)లోని ప్రసాద్ ఐమాక్స్ లో అభిమానుల సమక్షంలో  టైటిల్ ని ప్రకటించడంతో పాటు  కొన్ని గ్లింప్స్ ని రిలీజ్ చేసారు. సదరు గ్లింప్స్ లో ఆఫీసర్ లుక్ తో ఉన్న చిరంజీవి పెద్ద కారులో నుంచి దిగాడు. సూటు, బూటు, మెళ్ళో టై, ఐడి కార్డు ధరించిన చిరంజీవి   సిగరెట్ కాలుస్తూ స్టైల్ గా నడుస్తున్నాడు. వెనక పెద్ద పెద్ద గన్స్ చేతబూని, కమాండర్ డ్రెస్ లో, కొంత మంది చిరంజీవిని  ఫాలో అవుతున్నారు. దీంతో పాటు  చేతిలో గన్ తో మెట్లు దిగుతూ వస్తున్న చిరంజీవి, గుర్రంతో ఉన్న  చిరంజీవి గ్లింప్స్ కూడా రిలీజ్ చెయ్యడం జరిగింది.

టైటిల్ గ్లింప్స్ రిలీజ్  సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతు మూవీలో 'చిరంజీవి' గారు ఇంటిలెజన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఫ్యామిలీ డ్రామా, ఎంటర్ టైన్ మెంట్ ఒక లెవల్లో ఉండనుంది. మనం ఎంచుకున్న కథ ప్రకారం లుక్ డిజైన్ అవుతుంది.దీంతో  కథకి తగ్గ క్యారక్టర్ కోసం చిరంజీవి గారు చాలా కష్టపడ్డారు. ఆయన లుక్ వల్లే సినిమా చాలా బాగా వస్తుంది. సంక్రాంతికి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నామని   చెప్పుకొచ్చాడు. చిరంజీవి, అనిల్ రావిపూడి ల చిత్రం ప్రకటించినప్పటి నుంచి కథ విషయంలో రకరకాల వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా అనిల్ రావిపూడినే చిరంజీవి క్యారక్టర్ గురించి చెప్పడంతో పాటు ఫ్యామిలీ డ్రామాతో  తెరకెక్కబోతుందన్న విషయం అర్ధమవుతుంది. అనిల్ రావిపూడి గత బ్లాక్ బస్టర్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం 'లో 'వెంకటేష్'(Venkatesh)పోలీస్ ఆఫీసర్ గా చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి సరసన నయనతార(Nayanthara)జంటగా చేస్తున్న 'మన శంకర్ వరప్రసాద్ గారు' లో  విక్టరీ వెంకటేష్ కూడా ఒక క్యారక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ విషయాన్నీ అనిల్ రావిపూడి నే అధికారకంగా ప్రకటించాడు. భీమ్స్ సిసోరియా మ్యూజిక్ ని అందిస్తుండగా, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతు చిరంజీవి గారిని నా కంటి తో ఎలా చూడాలని అనుకున్నానో అలా చూసే అవకాశం నాకు వచ్చింది. తప్పకుండా మన శంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వచ్చి అందరకి నచ్చుతుంది. 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com