Home

»

Latest News

రామ్, తమన్నాల మన లవ్ స్టోరీ

Apr 19, 2011 7:53AM

రామ్, అందాల మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా చిత్రానికి మన "లవ్ స్టోరీ" అన్న పేరుని నిర్ణయించారు. వివరాల్లోకి వెళితే యువ హీరో రామ్ హీరోగా, అందాల మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, కరుణాకరన్ దర్శకత్వంలో, యునైటెడ్ మూవీస్ పతాకంపై, పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రానికి "మన లవ్ స్టోరీ" అన్న పేరుని నిర్ణయించారు.

ram wallpapers, ram stills, ram images, ram pics, ram photos, ram pictures

ఈ "మన లవ్ స్టోరీ" దర్శకుడు కరుణాకరన్ గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన సూపర్ హిట్ చిత్రం "తొలి ప్రేమ" చిత్రానికి యశోసాగర్, స్నేహా ఉల్లాల్ జంటగా నటించిన "ఉల్లాసంగా- ఉత్సాహంగా" అనే చిత్రానికి, ఇటీవల యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన హిట్ మూవీ "డార్లింగ్" చిత్రం వంటి అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు.

 

యువ హీరో రామ్ కి దేవదాసు, మస్కా చిత్రాల్లాంటి హిట్ సినిమా అత్యవసరంగా కావాల్సిన సమయంలో ఈ "మన లవ్ స్టోరీ" చిత్రం కథ నచ్చి ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి "సింహా''వంటి సూపర్ హిట్ చిత్రం నిర్మించిన తర్వాత నిర్మిస్తున్న చిత్రం ఈ "మన లవ్ స్టోరీ". హీరోయిన్ తమన్నా భాటియా తను నటించిన "100% లవ్" చిత్రం ఈ నెల 29 వ తేదీన విడుదల కాబోతూంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com