ఎన్టీఆర్ హీరోయిన్.. బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్!
on Sep 20, 2021
మమతా మోహన్ దాస్.. దక్షిణాది ప్రేక్షకుల మెప్పు పొందిన కథానాయిక. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన `రాఖీ`తో సింగర్ గానూ.. అదే ఎన్టీఆర్ నటించిన `యమదొంగ`తో నాయికగానూ తెలుగునాట ఆయా విభాగాల్లో తొలి అడుగులేసి ఎంటర్టైన్ చేసింది మమత. ఆపై.. `చింతకాయల రవి`, `కింగ్`, `కేడి` తదితర బిగ్ టికెట్ ఫిల్మ్స్ లో మురిపించిన మమత.. ప్రస్తుతం మలయాళంలో బిజీ యాక్ట్రస్. రీసెంట్ గా ఆమె నటించిన `ఫోరెన్సిక్` అనువాద రూపంలో ఓటీటీలో స్ట్రీమ్ అయి అలరించింది.
ఇదిలా ఉంటే.. అటు మలయాళం, ఇటు తమిళ్ తో కలుపుకుని దాదాపు డజను చిత్రాలతో బిజీగా ఉన్న మమత.. అక్టోబర్ నెలలో బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో కొత్త సినిమాలతో సందడి చేయనుంది. `అంధాధున్`కి మలయాళ వెర్షన్ గా తెరకెక్కిన `భ్రమమ్` అక్టోబర్ 7న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుండగా.. తమిళ చిత్రం `ఎనిమీ` అక్టోబర్ 14న థియేటర్స్ లో సందడి చేయనుంది. మరి.. ఈ రెండు సినిమాల్లోనూ నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో అభినయించిన మమత.. ఆయా చిత్రాలతో ఎలాంటి గుర్తింపుని పొందుతుందో చూడాలి.
Also Read