ఆ సినిమా సీక్వెల్‌ని కన్ఫర్మ్ చేసిన మమ్ముట్టి!
on Feb 6, 2023
మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి 71 ఏళ్ల వయసులోనూ క్షణం తీరికగా లేరు. అసలు ఖాళీగా కూర్చోవడం అంటే ఎలా ఉంటుంది? అంటూ చమత్కరిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ, సక్సెస్‌లను టేస్ట్ చేస్తూ, ఫెయిల్యూర్స్ ని పాఠాలుగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు మమ్ముట్టి. పాత్ర ఎలాంటిదైనా, సన్నివేశం ఏం డిమాండ్ చేసినా, వెంటనే పరకాయ ప్రవేశం చేసి శభాష్ అనిపించుకుంటారు మమ్ముట్టి. అందుకే మమ్ముట్టికి మలయాళంలోనే కాదు, వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు.
ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బీ సీక్వెల్ బిలాల్ గురించి మాట్లాడారు. బిగ్‌బీ సీక్వెల్‌ని మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిసి చేస్తారనే టాక్ నడుస్తోంది. ఉన్ని ఆర్ ఈ సినిమా కోసం కథను సిద్ధం చేస్తున్నారట. కింగ్ మేకర్ మామున్ని కథ ప్రధానంగా సాగుతుంది. సీక్వెల్. మామున్ని సొసైటీలో ఎప్పుడూ అలజడి సృష్టించాలనుకుంటాడు. అయితే అంతకన్నా అతనికి అండర్‌వరల్డ్ లో ఉన్న తనవారి సుఖశాంతులు ముఖ్యం. వాటన్నిటిని ఎలా బ్యాలన్స్ చేసుకున్నాడు? అనుకున్నది సాధించాడా లేదా అనేది బిగ్ బీ కథ. డైరక్టర్ అమల్ నీరద్ స్క్రిప్ట్ ఫైనల్ చేసేశారట. పలువురు రచయితలతో కలిసి ఆయన స్క్రిప్ట్ ఫైనల్ చేసినట్టు వినికిడి. అంతా అనుకున్న ప్రకారమే జరిగితే ఈ ఏడాది మేలో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.
సినిమాను ఎక్కువ శాతం పోలాండ్‌లో తెరకెక్కించాలని భావిస్తున్నారట. మమ్ముట్టి, దుల్కర్ ఇద్దరూ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం పోలాండ్ వెళ్లినప్పుడు కొన్నాళ్లపాటు ఇద్దరూ కలిసి పర్సనల్ టైమ్‌ని కూడా స్పెండ్ చేయాలని భావిస్తున్నారట. ఎంత పెద్ద సినిమాకైనా 30 రోజులు కాల్షీట్ కేటాయించేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు ఆ మధ్య దుల్కర్ సల్మాన్ చెప్పిన విషయం జనాల్లో బాగా నలిగింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
