Home

»

Latest News

వైరల్: అల్లు అర్జున్ పై మమితా బైజు కీలక వ్యాఖ్యలు..  డైహార్డ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో 

Aug 11, 2026 9:30AM

 

ప్రేమలు మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించిన మలయాళ భామ మమితా బైజు. ఆ తర్వాత తన హవా కొంచం తగ్గట్టుగా అనిపించినా ఈ నెల 14 న రాబోయే శ్వనాథ్ అండ్ సన్స్ తో సూర్య తో కలిసి ఆడిపాడనుంది. ప్రచార చిత్రాలు చూస్తుంటే థియేటర్స్ నుంచి వచ్చాక కూడా తన గురించే ఆలోచించడం ఖాయంలా ఉంది.

తాజాగా 'విశ్వనాథ్ అండ్ సన్స్'  ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మమితా బైజు మాట్లాడుతూ  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే నాకు చిన్నప్పటి నుంచే విపరీతమైన అభిమానం. ఒక రకంగా  డైహార్డ్ ఫ్యాన్. 'హ్యాపీ', 'బన్నీ', 'జులాయి', 'ఇద్దరమ్మాయిలతో' వంటి ప్రతి సినిమాని కనీసం 10 సార్లకు పైగా రిపీట్ మోడ్‌లో చూశాను. మూవీస్ లో ఆయన వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, యాటిట్యూడ్ అంటే ప్రాణం. ముఖ్యంగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో ధరించిన స్టైలిష్ క్యాసియో వాచ్ నచ్చి, నేను  కూడా సేమ్ అలాంటి వాచ్‌నే కొనుక్కుని వేసుకునేదాన్నీ. స్కూల్ రోజుల్లో అల్లు అర్జున్ డ్రెస్సింగ్ శైలిని పూర్తిగా కాపీ కొడుతూ, ఫుల్ స్లీవ్ టీషర్ట్ మీద షర్ట్ వేసుకుని, ఆ షర్ట్ చేతులను మడిచి టాంబాయ్‌లా స్కూలుకు వెళ్లేదాన్నని మమితా బైజు  చెప్పుకొచ్చింది. 

Also read: హీరోల వల్ల ఉపయోగమేంటి.. ఏం చేస్తున్నారు!


2017లో 'సర్వోపరి పాలక్కారన్' చిత్రంతో చలనచిత్ర రంగానికి పరిచయమైన ఈ భామ, ఆ తర్వాత 'ఆపరేషన్ జావా', 'ఖో ఖో' (కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు గ్రహీత), 'సూపర్ శరణ్య' వంటి హిట్ చిత్రాల్లో తన ప్రతిభను చాటుకుంది. అయితే 'ప్రేమలు' తెచ్చిపెట్టిన గ్లోబల్ పాపులారిటీ ఆమె రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ, మానసిక ప్రశాంతత కోసమే  కొంతకాలంగా సోషల్ మీడియాకి  దూరంగా ఉంటున్నానని ఈ భామ స్పష్టం చేసింది.  

Mamitha Bhaiju, Allu Arun, Suriya

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com