Home

»

Latest News

పవన్ కి మహేశ్ డబ్బులిస్తాడా?

Jun 1, 2015 5:03PM

పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా వస్తోందా? అందుకు తగ్గా సన్నాహాలు జరుగుతున్నాయా? త్రివిక్రమ్ మాట మేరకే ఇద్దరి కాంబినేషన్ సెట్టైందా? వీటన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ తెరపై కాదట. మధ్యలో ఈ ట్విస్టేంటి అంటారా? పవన్ హీరో మహేశ్ బాబు ప్రొడ్యూసర్ అట. ఏంటి అర్థంకాలేదా? నిజమే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కనున్న మూవీకి మహేశ్ బాబు ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడట. మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ హౌస్ కింద తన సినిమా నిర్మించాలని మాటల మాంత్రికుడు కోరాడట. స్నేహితులు అడిగిసరికి మహేశ్ సరే అన్నాడట. ఏదేమైనా మాటల మాంత్రికుడు ఒక దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నాడని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ కాంబినేషన్ నిజమే అయితే పవన్-మహేశ్ ఫ్యాన్స్ కి పండగే పండుగ.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com