Home

»

Latest News

మహేశ్‌,బాలయ్యల ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్

Oct 27, 2016 12:44PM

టాలీవుడ్‌లో ప్రస్తుతం గాలివార్తలు తెగ షికారు చేస్తున్నాయి. అవి నిజమని అభిమానులు నమ్మేలోపలే ఆ వార్తొల్లోని వ్యక్తులు వాటిని నమ్మవద్దని స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారని దానికి కొరటాల దర్శకత్వం వహించబోతున్నారనే న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేసింది. ఇప్పటికే ఆ సినిమా కోసం కొరటాల, మహేశ్‌లిద్దరూ బాలయ్యను సంప్రదించారట. కొరటాల చెప్పిన  స్టోరీ లైన్ నచ్చడంతో బాలయ్య కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడన్నది ఆ వార్త సారాంశం.

ఈ విషయం ఆ నోటా ఈ నోటా చక్కర్లు కొడుతూ చివరికి డైరెక్టర్ కొరటాల శివ వద్దకు చేరింది. దీనిపై ఆయన స్పందిస్తూ మహేశ్‌తో తాను చేయబోతున్న సినిమాలో బాలయ్య ఓ కీ-రోల్‌లో నటిస్తున్నారన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొరటాల క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీలో ఎలాంటి కాంభినేషన్‌కు తావు లేదని..అసలు ఇది మల్టీస్టారర్ మూవీనే కాదని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంపై వస్తున్న రూమర్లను పట్టించుకోవద్దని ట్విట్టర్‌లో స్పష్టం చేశాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com