
`భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు` వంటి హ్యాట్రిక్ హిట్స్ తరువాత సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి రాబోతున్న సినిమా `సర్కారు వారి పాట`. కేరళకుట్టి కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `గీత గోవిందం` దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు సమకూర్చుతున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ వేసవి కానుకగా మే 12న జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, `సర్కారు వారి పాట`కి పోటీగా అదే వారంలో మరో ఆసక్తికరమైన సినిమా రాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. `డాక్టర్` వంటి విజయవంతమైన చిత్రం తరువాత శివ కార్తికేయన్ హీరోగా నటించిన తమిళ సినిమా `డాన్`. శిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ డ్రామా.. మే 13న రిలీజ్ కానుంది. తెలుగులోనూ అదే రోజున అనువాద రూపంలో విడుదల కానుందని సమాచారం. మరి.. రెండు వరుస రోజుల్లో రాబోతున్న ఈ రెండు చిత్రాల్లో దేనికి ప్రజాదరణ దక్కుతుందో చూడాలి. అలాగే, మహేశ్ బాబు వర్సెస్ శివ కార్తికేయన్ అన్నట్లుగా ఉన్న ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు విన్నర్ గా నిలుస్తారు? అన్నది కూడా ఆసక్తికరమే.
కాగా, `డాన్`లో ప్రియాంక అరుళ్ మోహన్ నాయికగా నటించగా.. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ బాణీలు అందించాడు.




.webp)
.webp)
