Home

»

Latest News

న్యూ ఇయ‌ర్ లో `మ‌హ‌ర్షి` నెక్ట్స్ షెడ్యూల్!!

Dec 26, 2018 11:11AM


              
`భ‌ర‌త్ అనే నేను` చిత్రంతో 2018లో మంచి స‌క్సెస్ అందుకున్నాడు మ‌హేష్‌. దీని త‌ర్వాత వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో `మ‌హ‌ర్షి` సినిమా చేస్తున్నాడు.  అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ ఆర్ ఎఫ్‌సిలో మంగ‌ళ‌వారంతో పూర్తి చేసుకుంది. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ ను జ‌న‌వ‌రిలో జ‌రుపుకోనుంది.  ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది.
 
ఈ సినిమాలో అమెరికాకు చెందిన  ఓ పెద్ద కంపెనీ సీఈవోగా , వ‌ర‌ల్డ్ లోనే టాప్ ఫైవ్ మిలియ‌నీర్స్ లో ఒక‌డిగా న‌టిస్తున్నాడ‌ని ఫిలిం న‌గ‌ర్ లో వార్త‌లు వెలువ‌డుతున్నాయి.  అంటే మ‌హేష్‌... శ్రీమంతుడు సినిమా త‌ర్వాత మ‌రోసారి అతి ధ‌న‌వంతుడుగా క‌న‌ప‌డ‌బోతున్నాడన్న‌మాట‌.   శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్, పివీపీ సినిమా, వైజ‌యంతి మూవీస్ ఈ చిత్రాన్ని స‌యుక్తంగా నిర్మిస్తున్నారు.  పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. అల్ల‌రి న‌రేష్ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com